తండ్రికి తెలియకుండా ప్రియుడి కోసం సౌది నుండి హైదరాబాద్ వచ్చేసింది

426

ప్రేమకు అవధుల్లేవ్, అంతరాలు లేవు….రెండు మనసుల మధ్య ప్రేమ పుడితే వారు యే దేశం లో ఉన్నా ఒక్కటవుతారు.ప్రేమను కులాలు, మతాలు, ఏవీ అడ్డుకోలేవు.ఇది ఎందరో ప్రేమికులు నిరూపించారు.డబ్బు హోదా కులం మతం దేశం అనే అడ్డుగోడల్ని చెరిపేసి ఒక్కటైనా జంటలు ఎన్నో.అలా రెండు వేరు వేరు దేశాలకు చెందిన ఒక ప్రేమజంట ఇప్పుడు ఒక్కటయ్యారు.మరి ఆ గ్రేట్ లవర్స్ గురించి తెలుసుకుందామా.

Related image

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షేక్ అజీముద్దీన్ అనే యువకుడు బతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం సౌదీకి వలస వెళ్లాడు. అక్కడ ఓ వ్యాపారవేత్త దగ్గర డ్రైవర్ గా చేరాడు. కోన్నాళ్లకు తన యజమాని కుమార్తె రజా అల్ హర్బీ కి అజీముద్దిన్ పై ప్రేమ పుట్టింది. సౌదీలోని మ్యారేజ్ రూల్స్ ప్రకారం అక్కడ వివాహం చేసుకోవడం కుదరలేదు. దీంతో అజీముద్దీన్ 2018 జనవరిలో ఇండియాకి వచ్చేసాడు.ఏమీ చేయలేక విడిపోయారు.కానీ ప్రేమ వారిద్దరి దూరాన్ని దగ్గర చేయాలనీ అనుకుంది.ఆ అమ్మాయి, అతడిపై ప్రేమను చంపుకోలేక పోయింది.సోషల్ మీడియా ద్వారా చాటింగ్, వీడియో కాల్స్, ఫోన్ మాట్లాడటం ఆపలేదు.అలా అజీముద్దీన్ పై పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ సౌదీ అమ్మాయి.ఎలాగైనా అతనితోనే కలిసి బతకాలని నిర్ణయించుకుంది.ఎలాగైనా ఇండియాకు రావాలనకుంది.

Image result for dubai girls

సౌదీలోని తన ఇంటి నుంచి అదే అడ్రస్ తో వీసాకు అప్లై చేస్తే, ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందని భయపడింది. దీంతో తన ప్రేమ విషయం బయటపడితే ఇండియాకు రావడం వీలుకాదని అనుకున్న తను మే నెలలో టూర్ కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి, నేపాల్ కు చేరుకుంది.అక్కడి నుండి అక్రమంగా సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించింది.రోడ్డు, రైలు మార్గంలో హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి నిజామాబాద్ లో ఉంటున్న ప్రియుడు అజీముద్దీన్ ను కలుసుకుంది. మే నెలలోనే వివాహం చేసుకున్న ఈ ప్రేమజంట కాపురం పెట్టారు. కూతురు కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టాడు అమ్మాయి తండ్రి. చివరికి తను తెలంగాణలో ఉన్నట్లు గుర్తించారు.

Related image

ముంబైలోని సౌదీ ఎంబసీసి లో తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. తన కూతురినీ ఇండియా డ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో CCS పోలీసులు స్పెషల్ టీమ్స్ తో రంగంలోకి దిగారు , నిజామాబాద్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు.పోలీసులతో తన ఇష్ట పూర్వకంగానే వచ్చానని చెప్పింది. అజీముద్దీన్ ఇండియాకు వచ్చిన ఐదు నెలల తర్వాత ఆమె వచ్చింది కాబట్టి అది కిడ్నాప్ కాదని అన్నారు పోలీసులు. ఒకవేళ ఎంబసీ అధికారుల సమక్షంలో తను తిరిగి సౌదీ వెళ్తానంటేనే తండ్రికి అప్పగిస్తామని చెప్పారు పోలీసులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక్కడే ఉంటానంటే నివసించడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలా. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై ఆలోచిస్తాం అని చెప్పారు. అంతే తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు. మొత్తానికి ప్రేమకు సరిహద్దులు లేవు అని ఈ అమ్మాయి నిరూపించింది.వీళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని అందరం కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రేమ గురించి ప్రేమ కోసం ప్రేమికులు చేసే ఇలాంటి సాహసోపేతమైన చర్యల గురించి అలాగే ప్రియుడి కోసం ఇండియాకు వచ్చిన ఈ యువతీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.