ఈ ఆదివాసీ తండ్రి ముందు కుబేరులు బలాదూర్.. కొడుకు ఆడుకోడానికి వాగునే ఇంటికి తెచ్చాడు..

470

తల్లిప్రేమ గొప్పదే. అలాగే తండ్రి ప్రేమ కూడా తక్కువేం కాదు. తల్లి తన బిడ్డకు రక్తమాంసాలను పంచి ఇస్తే తండ్రి ఆ బిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాడు. ఇందులో పేద, ధనిక అనే తేడాలేవీ ఉండవు. తల్లిదండ్రులకు పిల్లలంటే బోలెడంత ప్రేమ ఉంటుంది. వారు ఏం అడిగినా తెచ్చి ఇవ్వడానికి వెనుకాడరు. బుడి బుడి అడుగులు వేసే పిల్లలు సరదాగా ఆడుతుంటే చూసి ఆనందించడమే కాదు.. వారికి ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడతారు. బిడ్డల కోసం తండ్రి పడే తపనకు అద్దం పట్టే ఉదంతం ఒకటి వెలుగు చూసింది. మరి ఆ ఉదంతం గురించి తెలుసుకుందామా.

విశాఖపట్నం మన్యానికి చెందిన ఓ గిరిజనుడు తన కొడుకు ఆడుకోడానికి ఏకంగా సెలయేటి గలగలను ఇంటి ముందుకు తీసుకొచ్చాడు. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆ గిరిజనుడి కొడుకు రోజూ స్నానం చేయడం కోసం తమ ఇంటికి దగ్గర్లో ఉన్న వాగులోకి స్నానం చేయడానికి వెళ్తుండేవాడు. పిల్లాడు సరదాగా స్నానం చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ పొరబాటున జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటనే ఆలోచన ఆ పిల్లాడి తండ్రిని భయపెట్టింది. అందుకే తన బుర్రకు పదును పెట్టాడు. కొడుక్కు ఇంటివద్దే ఆ వాగు నీటితో స్నానం చేయించాలనుకున్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్ తరహా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. వెదురు బొంగులను పైపులుగా మార్చి వాగు నుంచి ఇంటికి ‘పైప్ లైన్’ ఏర్పాటు చెయ్యాలనుకున్నాడు. దీనికోసం ఎన్నో తిప్పలు పడ్డాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు విఫలమైనప్పటికీ ఓర్పుతో ప్రయత్నించి వెదురు బొంగులను మధ్యలోకి చీల్చి ఒకదానితో మరొకటి కలుపుతూ కర్రల ద్వారా వంతెన రూపంలో ఏర్పాటు చేసి నీటిని ఇంటి దగ్గరకు మళ్లించాడు. వాగు నీళ్లు ఆ బొంగుల గుండా గూడెంలోని ఇంటికి వద్దకు చేరాయి. దీంతో తండ్రీకొడుకుల సంబరానికి అంతు లేకుండా పోయింది.

ఈ క్రింద వీడియో చూడండి

తండ్రి చేసిన భగీరథ ప్రయత్నం కారణంగా తన ఇంటి దగ్గరే పడుతోన్న నిత్య జలధార కింద ఆ పిల్లడు ఇప్పుడు హ్యాపీగా జలకాలాట ఆడుతున్నాడు. తన కొడుకు నీటిలో కేరింతలు కొడుతుంటే ఆ తండ్రి మురిసిపోతున్నాడు. చూశారుగా ఈ తండ్రి తన కొడుకుకు ఎంత గొప్ప పనిచేశాడో. ఇతను చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎక్కడంతో అందరు అతనిని పొగుడుతున్నారు. తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, వారు పిల్లల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు అని మరొకసారి నిరూపించారు అని కామెంట్స్ వస్తున్నాయి. మరి కొడుకు కోసం ఏకంగా వాగునే తన ఇంటి వద్దకు తీసుకొచ్చిన ఈ తండ్రి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.