బాలికను నడి సముద్రంలో పడేస్తే 50 ఏళ్ల తర్వాత బయటపడిన నిజాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ పాప గాథ

293

సముద్ర ప్రయాణం చాలా డేంజర్.సముద్రంలో షిప్స్ మునిగిపోయిన అనేక ఘటనల గురించి మనం విన్నాం.అయితే సముద్రంలో మునిగిపోయి బతికిన వాళ్ళు ఎందరో ఉన్నారు.అలా సముద్రంలో పడి 18 గంటలు సముద్రంలో ఉండి బతికిన ఒక చిన్నారి గురించి ఆమె అనుభవించిన కష్టాల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.ఈమె పేరు టెర్రీ చోప్ డేపరాయిడ్. తండ్రి ఆర్థర్ డేపరాయిడ్. ఇతను తన పిల్లల కోసం లైఫ్ టైం అడ్వాంచెర్ చెయ్యాలని అనుకునేవాడు.దాని కోసం ఐదేళ్లు డబ్బును ఆదా చేశాడు.ఇతనికి ముగ్గురు పిల్లలు.అందులో టెర్రీకి 11 ఏళ్ళు.అన్నకు 14 తమ్ముడికి 7 ఏళ్ళు.ఆర్డర్ వీలైతే నెలరోజులు చిన్న చిన్న ఐలాండ్స్ లో ఉండాలనుకున్నాడు.డబ్బులు ఆదా అయ్యాయి కాబట్టి బ్లూ బెల్ అనే బోటును నెలరోజుల పాటు అద్దెకు తీసుకున్నాడు.ఆహరం కూడా సిద్ధం చేసుకున్నాడు.ఫ్లోరిడా నుంచి మహమ్మాన్ దీవులకు వెళ్లాలని ప్లాన్ చేశాడు.నవంబర్ 8 1961 న తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.జూలియస్ అనే వ్యక్తిని బోట్ కు కెప్టెన్ గా నియమించుకున్నాడు.జులియన్ తన భార్యను కూడా తీసుకొచ్చాడు.ఆ దీవులకు వెళ్లాలంటే వారం రోజులు పడుతుంది.మొదటి నాలుగు రోజులు హ్యాపీగా సాగింది.మహమ్మాన్ దీవికి చేరకముందే బిమిని ఐలాండ్ కు చేరుకున్నారు.

Image result for beach babys

అక్కడ ఒక గదిని తీసుకుని ఎంజాయ్ చేశారు.అలా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళి బోట్ ప్రయాణం మొదలుపెట్టింది.పిల్లలు అలసిపోయి పడుకున్నారు.అయితే టెర్రీ బోట్ చివరన ఉండే ఒక బెడ్ రూమ్ లో పడుకుంది.అయితే చీకట్లో తన తమ్ముడి ఏడుపు వినిపించి నిద్ర లేచింది.అయితే అప్పుడే అసలు కథ నడించింది.కెప్టెన్ గ వచ్చిన జులియన్ పచ్చి మోసగాడు. అతను భార్యను కూడా తీసుకురావడం వెనుక ఒక కథ ఉంది.భార్య మీద పెద్ద ఇన్సూరెన్స్ డబ్బు ఉంది.తన భార్యను చంపి ఎవరికీ అనుమానం రాకుండా సముద్రలో పడేయాలనుకున్నాడు.చివరికి అదే పని చేశాడు.ఆమెను చంపాడు.అయితే వీళ్ళు గొడవ పడుతున్న సమయంలో ఆర్థర్ అక్కడికి వచ్చాడు.ఇదంతా ఆర్థర్ చూశాడు.అందుకే సాక్ష్యం లేకుండా చెయ్యాలనుకున్నాడు.కత్తితో ఆర్థర్ ను చంపాడు.అయితే ఎవరు బతికిన తన బండారం భయపడుతోందని అందరిని చంపాలనుకున్నాడు.అందరిని చంపాడు ఒక్క టెర్రిని తప్పా.టెర్రిని కూడా చంపాలనుకున్నాడు.కానీ టెర్రీ అతని నుంచి తప్పించుకుని సముద్రంలో దూకేసింది.అయితే టెర్రీ బతికితే తనకు సమస్య అనుకుని అతను కూడా సముద్రంలో దూకాడు.ఒక చిన్న బోట్ జూలియస్ కు కనిపించింది.అయితే అందులో టెర్రీ ఉందేమో అని వెతికాడు.

Related image

కానీ అతనికి టెర్రీ కనిపించలేదు.టెర్రీ అక్కడ పక్కనే ఉండే ఒక చిన్న ఎమర్జెన్సీ బోట్ ఎక్కేసింది.ఆ బోట్ అలల తాకిడికి ఒక దరికి చేరింది..టెర్రీ కనిపించకపోవడంతో అతని బోట్ సహాయంతో మెల్లగా పోర్ట్ కు చేరుకున్నాడు.ప్రమాదంలో మేము తీసుకెళ్లిన బోట్ మునిగిపోయిందని అందరు చనిపోయారని ఓనర్ కు చెప్పాడు.పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.చివరగా భార్య ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అప్ప్లై చేశాడు.అయితే ఇక్కడే కథంతా అడ్డం తిరిగింది.జూలియస్ కు అప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని అందరిని చంపి ఇన్సూరెన్స్ డబ్బు తీసుకుంటున్నాడని బయటపడింది. ఒక సముద్ర ఒడ్డుకు చేరిన టెర్రిని అటువైపుగా వెళ్తున్న ఒక పెద్ద షిప్ వాళ్ళు చూశారు.ఆ పాపను ఆ షిప్ లో ఉండేవాళ్ళు బతికించారు.అప్పటికే డీ హైడ్రేషన్ కారణంగా బాడీ మొత్తం నిస్తేజకంగా మారింది.పాప బతుకుతుందని ఎవరు అనుకోలేదు.అయితే షిప్ లో ఉండే డాక్టర్ టెర్రిని బతికించాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పోర్ట్ కు తీసుకెళ్లారు.పోలీసులను పిలిపించారు.పోలీసులు ఆ పాపను ఏం జరిగిందని అడిగారు.అయితే ఆ పాప పోలీసులకు ఏమి చెప్పలేదు.పాప అడ్రెస్ చెప్పడంతో పాప మేనత్త వచ్చి పాపను ఇంటికి తీసుకెళ్లింది.ఎవరికీ ఏమి చెప్పలేదు.అయితే జూలియస్ కేసు కోర్ట్ కు వెళ్లిన తర్వాత జులియన్ అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్నాడు.అప్పుడు చెప్పింది టెర్రీ జరిగిందంతా.జూలియస్ అందరిని చంపాడని చెప్పింది.బాగా చదువుకున్న టెర్రీ పీహెచ్ డీ చేసింది.” అలోన్ అర్ఫానుడ్ ఆన్ ద ఓషియన్ ” అనే పుస్తకంలో తన కథ అంతా రాసుకొచ్చింది.ఇలా ఒక పాప నడి సముద్రంలో నరకయాతన అనుభవించింది.ఇప్పుడు ఆమె రాసిన పుస్తకం సెన్సేషన్ క్రియేట్ చేసింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.టెర్రీ గురించి ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇప్పడూ ఆమె రాసిన పుస్తకం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.