హైదరాబాద్ లో మరొకసారి కలకలం రేపుతున్న కుక్క బిర్యానీ

311

అది పేరుకే మటన్ బిర్యానీ, కానీ వండింది మాత్రం కుక్క మాంసంతో. రోడ్ల వెంబడి ఉండే కొన్ని స్ట్రీట్ హోటళ్లలో పిల్లి బిర్యానీ వడ్డిస్తున్నారనే వార్తను ఇటీవలే అందించాం. ఇప్పుడు షాకింగ్ గా కుక్క మాంసంతో కూడా బిర్యానీ వండి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం హైదరాబాద్ లో పెద్ద హల్చల్ చేస్తుంది. అయితే ఈ కుక్క బిర్యానీ వెనుక పెద్ద కథనే ఉంది. మరి అదేమిటో తెలుసుకుందామా.

Image result for కుక్క బిర్యానీ

శాలిబండలోని షాగౌస్ హోటల్ లో కుక్క బిర్యానీ అమ్ముతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ దుష్ప్రచారం ఎఫెక్ట్ ఓ హోటల్ పై తీవ్రంగా పడటంతో.. ఓ హోటల్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. మొత్తానికి దీనిపై ఆరా తీసిన పోలీసులు సదరు ఫేక్ ప్రచారకుడిని పట్టేసుకున్నారు.మదీనలోని రికబ్ గంజ్ లో నివాసముంటున్న వలబోజు చంద్రమోహన్..ఏంబీఏ చదువుతున్నాడు. తన స్నేహితులతో కలిసి శాలిబండలోని షాగౌస్ హోటల్ లో బిర్యానీ తినడానికి వెళ్లేవాడు. డిసెంబర్ లో ప్రతిరోజూ ఇక్కడే బిర్యానీ తిందామని స్నేహితులు చెప్పారు. దీనికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని..స్నేహితులతో బిర్యానీ మాన్పించాలని చంద్రమోహన్ ఓ పథకం రచించాడు. గూగుల్ లో సెర్చ్ చేసి కుక్క బిర్యానీ ఫొటోలు సేకరించి. హైదరాబాద్ లోని హోటళ్లల్లో కుక్క బిర్యానీ కలుపుతున్నారు. జాగ్రత్త అంటూ ఈనెల 8న అగర్వాల్ స్కూల్ వాట్సాప్ లో పోస్ట్ చేశాడు. కాసేపటికే షాగౌస్ యజమానిని అరెస్టు చేశారని మరో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. మీడియాలోనూ బాగా ప్రచారం జరిగింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

జీహెచ్ఎంసీ అధికారులు ఈనెల 13న షాగౌస్ హోటల్ పై దాడులు నిర్వహించి శాంపుల్స్ సేకరించారు. తన హోటల్ పై దుష్ర్పచారం చేస్తున్నారంటూ షాగౌస్ యజమాని రబ్బాని రాయదుర్గం, క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు..చంద్రమోహన్ సికింద్రాబాద్ కు చెందిన సంతోష్ అనే వ్యక్తికి పంపాడని, ఆ తర్వాత 161 మంది సభ్యులుండే అగర్వాల్ స్కూల్ గ్రూపులో పోస్ట్ చేశాడని నిర్ధారించారు. ఫ్రెండ్స్ తో బిర్యానీ మాన్పించడానికే చంద్రమోహన్ ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. హోటల్ పై తనకు ఎలాంటి శత్రుత్వం లేదని సరదా కోసమే అలా చేశానని చంద్రమోహన్ తెలిపాడు. కేసును ఛేదించిన పోలీసులకు షాగౌస్ హోటల్ యజమాని రబ్బానీ ధన్యవాదాలు తెలిపాడు.మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా సరదా కోసం ఈ కుర్రాడు ఇంత పెడా రూమర్ ను స్పృష్టించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.