ఏపీలో వజ్రపు గనుల గుర్తింపు వంద‌లాదిగా త‌ర‌లి వ‌స్తున్న ప్ర‌జ‌లు

487
రాయల వారి కాలంలో రత్నాలు, వజ్రాలు రాశులుగా పోసి అమ్మారన్న కథలు మనం విన్నాం. అయితే నిజంగానే రాయలసీమలో వజ్రాలు దొరుకుతున్నాయా? వజ్రాల కోసం జనం ఎందుకు ఇంత ఎగబడుతున్నారు? ఎప్పుడో ఒక వజ్రం దొరికితే దాన్ని చూసి ప్రతి వర్షాకాలంలో సీమ ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగడం ఆనవాయితీగా మారింది. ఇది కేవలం సీమ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఇక్కడ వజ్రాలను దొరికించుకునేందుకు కర్ణాటక, తెలంగాణ నుంచి జనం వస్తున్నారంటే ఎంత పీక్ కు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో ఇప్పుడు వజ్రాల వేట ప్రారంభమైంది. వజ్రకరూర్ గ్రామం ముందునుంచి వజ్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయన్నది ఒక నమ్మకం మాత్రమే. బ్రిటీష్ కాలం నుంచే వజ్రకరూర్ లో వజ్రాల పరిశోధన, ప్రాసెసింగ్ కేంద్రం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జియాలజికల్ సర్వే అధికారులు ఇక్కడికి వచ్చి మట్టి నమూనాలు సేకరించి పరిశోధనలను చేశారు.
Image result for వజ్రాలు

ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు వజ్రకరూర్ ప్రాంతం జనం సందడితో మారిపోతోంది. రైతులు, కూలీలు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయన్న నమ్మంకంతో కుటుంబ సమేతంగా వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తుండటం సంప్రదాయంగా మారింది. వజ్రాల దొరుకుతాయన్న ప్రచారం జోరుగా జరగడం వల్లనే ఈ ప్రాంతానికి వేల సంఖ్యలో జనం తరలి వస్తుంటారు…వజ్రాలు దొరికినా వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి రావడంతో ఎవరూ బయటకు చెప్పరని, ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని కొందరు చెబుతున్నారు. వర్షం కురిసినప్పుడు మాత్రమే మట్టి కొట్టుకుని పోయి వజ్రాలు దొరుకుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. అందుకే వర్షాకాలంలో ఈ ప్రాంతం జన సంద్రంగా మారుతోంది. అయితే వజ్రాలు లేకపోయినా పిచ్చితో జనం వస్తున్నారని, తమ పంటపొలాలను నాశనం చేస్తున్నారని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Image result for వజ్రాలు

ఇక ఆంధ్రప్రదేశ్‌లో వజ్రపు గనుల ఆనవాళ్లు బయటపడ్డాయి అని ఇదే ప్రాంతంలో జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా గనుల ఆనవాళ్లను గుర్తించింది. అనంతపురం జిల్లాలో ఈ గనులు ఉన్నట్టు గుర్తించామని జీఎస్‌ఐ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్ ఎం. శ్రీధర్ తెలిపారు.అనంతపురం జిల్లా వజ్రకరూర్‌ ప్రాంతంలో ఓ మోస్తరు నాణ్యత ఉన్న వజ్రపు నిక్షేపాల ఆనవాళ్లను కనుగొన్నట్టు చెప్పారు. వీటిని శుధ్ది చేసి ఒక క్యారెట్‌ నాణ్యత గల వజ్రాలుగా మార్చవచ్చని ఆయన వివరించారు.

 

వర్షకాలం సమయంలో చేలను దున్ని వదిలేస్తే.. మరోసారి వర్షం రాగానే నాగలి సాళ్ళల్లో చిన్నచిన్న వజ్రాలు బయటకు వస్తుంటాయి. వీటిని కొనుగోలు చేసేందుకు వర్షా కాలంలో ఇతర ప్రాంతాల నుంచి వజ్ర వ్యాపారులు వచ్చి వజ్రకరూర్‌ ప్రాంతంలో తిష్ట వేస్తుంటారు. చాలా మందికి విలువైన వజ్రాలు దొరికినా కూడా వాటి విలువ సరిగ్గా తెలియక వ్యాపారులకు అతి తక్కువ ధరకే విక్రయించి మోసపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. మ‌రిచూశారుగా మన రాష్ట్రంలోనే ఉంది ఈ ప్రాంతం, మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.