విజయవాడలో నడిరోడ్డుపై భూతం..దగ్గరకు వెళ్ళి చూస్తే ఊహించని ట్విస్ట్

333

దెయ్యాలు అంటే అందరికి భయమే. అవి ఉన్నాయో లేవో కూడా తెలీదు కానీ వాటి పేరు ఎత్తితేనే భయం వేస్తుంది మనకు. ఇప్పుడు విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో గురువారం అర్ధరాత్రి దెయ్యాలు హల్ చల్ చేశాయి. నిజంగా దెయ్యాలు తిరిగాయా.. భయపడిపోకండి. ఎందుకంటే.. అవి నిజమైన దెయ్యాలు కాదు. కొందరు యువకులు చేసిన పని ఇది. మరి ఆ కుర్రాళ్ళు అలా ఎందుకు దెయ్యాల వేషాలు వేసుకున్నారో చివరికి ఏమైందో తెలుసుకుందామా.

Image result for ghost on road

విజయవాడలో షార్ట్ ఫిలిం షూటింగ్ పేరుతో అర్థరాత్రి కొంతమంది ఆకతాయిలు చేసిన పని వాహనదారులను బెంబేలెత్తించింది. తెల్లని దుస్తుల్లో జుట్టు వీరబోసుకుని భయపెట్టే గెటప్పులో రోడ్డు పైకి వచ్చిన ఆ యువకులను చూసి నిజంగా దెయ్యాలే అనుకుని కొంతమంది భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే రాత్రిపూట గస్తీ కాస్తున్న పోలీసులకు చిక్కడంతో వీరికి చెక్ పెట్టినట్టయింది. విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హార్రర్ షార్ట్ ఫిలిం షూటింగ్ పేరుతో ఆరుగురు యువకులు దెయ్యాల వేషాలు వేసుకుని స్థానికులను భయపెట్టినట్టు పోలీసులు తెలిపారు.

వారిని అదుపులోకి తీసుకుని మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం వారి తల్లిదండ్రులను పిలిపించి మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పారు. అంతకుముందు పోలీస్ స్టేషనులోనే ఆ యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆకతాయి చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఇప్పటికే ప్రజలంతా దొంగల భయంతో హడలిపోతున్న నేపథ్యంలో ఈ యువకులు చేసిన ఆకతాయి పనికి మరింత బెంబేలెత్తుతున్నారు. దెయ్యాల వేషంలో వారిని చూసినవారు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. నిజంగా షార్ట్ ఫిలిం కోసమే వారు దెయ్యాల వేషాలు వేశారా?.. లేక ఇంతకుముందు కూడా ఇలాంటివి చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.చూసారుగా ఈ ఆకతాయి కుర్రాళ్ళు ఎంతటి పని చేసారో. మరి ఈ కుర్రాళ్ళు చేసిన ఈ పని గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.