కేరళ వరదల్లో కొట్టుకొచ్చిన వజ్రాలు..వాటి కోసం జనాలు ఎలా కొట్టుకుని చస్తున్నారో చూడండి..

555

కేరళలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ వర్షాలతో రాష్టం అస్తవ్యస్తం అయ్యింది.లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతక ముందు ప్రకృతికి అందం కేరళ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రకృతి విలయతాండవం చేసి అక్కడి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముకం పట్టడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.అయితే వరదల్లో కొట్టుకొచ్చిన కొన్ని వస్తువుల కోసం అక్కడి ప్రజలు కొట్టుకుంటున్నారు.అంతలా కొట్టుకుంటున్నారు అంటే అదేమైన తినే పదార్థం అనుకునేరు.అస్సలు కాదు.మరి ఎందుకోసం కొట్టుకుంటూన్నారో చూద్దామా.

Image result for kerala flood snakes

వరద ముప్పు నుంచి కేరళ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగతున్నాయి. పది రోజులకుపైగా కొనసాగిన భారీ వర్షాలు.. కేరళకు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు రావనే వార్త మళయాళీలకు ఊరటనిచ్చింది. గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర విధ్వంసానికి గురైన కేరళను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్రాలతోపాటు సామాన్యులు సైతం ముందుకొస్తున్నారు.అయితే ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది దీన స్థితిలో బతుకుతున్నారు.కేరళలో ఎక్కడ చుసిన వరదకు కొట్టుకుపోయిన ఇల్లులు నేలకోరిగిపోయిన వృక్షాలు,కుంగిపోయిన రోడ్లు,అన్నిటికి మించి వందల సంఖ్యలో శవాలే కనిపిస్తున్నాయి.

Image result for kerala flood

ఈ సమయంలో వరదల్లో కొట్టుకొచ్చిన కొన్ని వస్తువుల కోసం అక్కడి ప్రజలు తెగ కొట్టుకుంటున్నారు. ఇంతకు ఆ వస్తువులు ఏమిటో తెలుసా..కొన్ని వజ్రాలు.వరదల్లో ఎక్కడ నుంచి కొట్టుకోచ్చాయో తెలియదు కానీ కొన్ని వజ్రాలు వరదల్లో కొట్టుకొచ్చి అప్పనచేడు అనే గ్రామంలో ఉన్న సహాయక స్థావరం దగ్గరకు వచ్చి చేరాయి.అయితే అక్కడ నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి ఏదో మెరుస్తున్నట్టు అనిపిస్తే వెళ్లి చూశాడు.వెళ్లి చూస్తే అవి వజ్రాలు.ఇక వాటిని చుసిన ఆనందంలో ఆ విషయం తన స్నేహితులకు చెప్పాడు.ఇక ఒకరి చెవిలో పడ్డ మాట ఉరికే ఉంటుందా చెప్పండి.ఆ చెవినా ఈ చెవినా పడి అందరికి పాకిపోయింది.

దాంతో ఒక్కసారిగా ఆ సహాయక కేంద్రం వద్ద నివాసం ఉంటున్న వాళ్ళందరూ ఆ వజ్రాలు ఉన్న స్థలానికి చేరుకున్నారు.అక్కడ ఉన్నవి కొన్ని వజ్రాలే.అవి కొందరికి దొరికాయి.కానీ ఇంకా దొరుకుతాయేమో అని అక్కడి ప్రజలు వాటి కోసం వెతకడం మొదలు పెట్టారు.సహాయక బృందాలు ఫుడ్ తీసుకొచ్చిన కూడా పట్టించుకోకుండా వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.మరి అవి ఉన్నాయో లేవో అని కూడా ఆలోచించకుండా వాటి కోసం వెతుకుతున్నారు.ఈ ఘటన గురించి కేరళ మీడియాలో ప్రసారం చేస్తున్నారు.ఇది చుసిన వాళ్ళందరూ వారికేమైన పిచ్చా ఏమిటి..ఏదో వరదల్లో కొన్ని కొట్టుకొచ్చి ఉంటాయి.అన్ని అక్కడే ఉంటాయా..ఎక్కడికో కొట్టుకుని పోయింటాయి.కొన్ని ఆ ప్రదేశంలోకి వచ్చి చేరి ఉంటాయి.అన్ని అక్కడే ఉంటాయని వెతుకుతున్నారంటే వారిని ఏమనాలో అర్థం అవ్వడం లేదని అనుకుంటున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళ వరదల గురించి అలాగే వరదల్లో కొట్టుకొచ్చిన వజ్రాల కోసం ఫుడ్ ను కూడా వదిలేసి వెతుకుతున్న ఆ వెర్రి జనాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.