గ‌ర్బ‌వ‌తైన భార్య ఆమె భ‌ర్త‌మాట వింటే కన్నీరే

182
ఓరోజు ఓ భార్య భ‌ర్త మాట్లాడుకుంటున్నారు. మ‌న‌కు ఇప్పుడు పుట్ట‌బోయే బిడ్డ ఎవ‌రు అయి ఉంటారు అని అనుకుంటున్నారు అని భార్య అడ‌గ‌గానే, నాకు కూతురు పుట్టినా కుమారుడు పుట్టినా ఒక‌టే అని అంటాడు. మ‌రి అబ్బాయి పుడితే ఏమి చేస్తారు అని అడిగితే అబ్బాయి పుడితే వాడికి న‌డ‌వ‌టం నుంచి పాటాలు, మంచి చ‌దువు ఎలా పెద్ద‌ల‌తో ఉండాలి ఎలా న‌లుగురిలో క‌ల‌వాలి  అమ్మాయిల‌తో ఎలా ఉండాలి స్త్రీల‌ను ఎలా గౌర‌వించాలి ఇలా అనేక విష‌యాలు చెబుతా అంటాడు.అబ్బాయి పుడితే ఇన్ని నేర్పుతారు మ‌రి అమ్మాయి పుడితే ఏం చేస్తారు అని భార్య అడిగింది. దీనికి సమాధానంగా అమ్మాయి పుడితే దానికి ఏమి నేర్పించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు ఎందుకు అంటే అమ్మాయి ఇంటికి మ‌హాల‌క్ష్మి అన్నీ త‌ను పుట్టుక‌తేనే నేర్చుకుంటుంది బై బెర్త్ వ‌స్తాయి అని చెబ‌తాడు అంతేకాదు త‌న తండ్రికి త‌ల్లికి ఏమి స‌మ‌స్య వ‌చ్చినా ముందు ఉండేది కూతురు కొడుకులు ఉన్నా కోడ‌ళ్ల పంచ‌న చేరుతారు కాని కూతురు మాత్రం త‌ల్లిదండ్రుల‌ని వ‌దిలిపెట్ట‌దు, అందుకే నాకు కూత‌రుపుడితే దానికి ఏమీ నేర్పించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు అని అంటాడు.
Image result for pregnancy

న‌న్ను తండ్రిగా కాకుండా కుమారుడిగా చూసుకుంటుంది … బిడ్డ‌గా న‌న్ను ఆద‌రిస్తుంది, ఏమైనా స‌మ‌స్య నాకు వ‌స్తే అది బాధ‌ప‌డుతుంది. అంతేకాని నాకు స‌మ‌స్య‌గా మార‌దు. ఇక నా గురించి ఎవరైనా ఏమైనా అంటే వెంట‌నే అది న‌న్ను వెన‌కేసుకు వ‌స్తుంది. న‌లుగురిలో నా తండ్రి అని గర్వంగా అంద‌రికి చెబుతుంది. న‌న్ను మా అమ్మ‌లా చూసుకుంటుంది అందుకే ఇంటిలో కూతురు ఉండాలి అంద‌మైన జీవితం నా కూతురులోనే చూసుకుంటాను అని చెప్పాడు అత‌ను. ఇక భ‌ర్త ద‌గ్గ‌ర కూడా నా తండ్రి ఇలా చూసుకునేవాడు అని చెబుతుంది.. త‌న భ‌ర్త‌ని కూడా నా విష‌యంలో ఎదిరిస్తుంది.. అందుకే తండ్రికి ఎక్క‌డైనా కూతురుపైనే ప్రేమ‌ ఉంటుంది అని, త‌న ప్రేమని భార్య త‌ర్వాత అంత‌కంటే ఎక్కువ‌గా కూతురుపైనే చూపిస్తాడు అని చెప్పాడు ఆ తండ్రి. త‌ల్లిదండ్రుల‌ను బాధ‌పెట్టే కొడుకులు ఉంటారు కాని ఎప్ప‌టికీ బాధ‌పెట్ట‌ని వారు కూతుర్లే, ఈ స‌మాజంలో కూతుళ్ల‌ని కొంద‌రు మాత్ర‌మే బ‌రువుగా చూసుకుంటారు పెళ్లి చేసేవ‌ర‌కూ బ‌రువు అనుకుంటారు ఇది త‌ప్పు త‌ను మ‌న జీవితం అని అనుకోవాలి అని తండ్రి చెప్పాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

కూతురు మ‌న ఇంటినుంచి పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా స‌రే మ‌న గురించే ఆలోచిస్తుంది. ఎప్ప‌టికీ మ‌నం దాని గుండెల్లో ఉండిపోతాము.. కూతురు అంటే కూడిక‌లు తీసివేత‌లు కావు మ‌న వాకిట్లో పెరిగే తుల‌సిమొక్క, అమ్మాయి అంటే బ‌రువు కాదు బాధ్య‌త‌, అమ్మాయి అంటే మ‌న జీవితం, అమ్మాయి అంటే భ‌ద్రంగా చూడాల్సిన గాజుకాదు మ‌రో అమ్మ, మ‌రి ఈ తండ్రి అత‌ని కూతురు గురించి చెప్పిన ఈ విష‌యం చూశారుగా మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.