రేపిస్టును 30 ఏళ్ల తర్వాత పట్టించిన కండోమ్.. ఎలాగో తెలిస్తే షాక్..

266

తప్పు చేస్తే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి మనం దొరికిపోవడం ఖాయం. కొంతమంది నేరం చేసి కొన్ని రోజులైన సరే అతనిని పోలీసులు పట్టుకోకపోతే నన్ను పట్టుకోవడం పోలీసుల వల్ల కాదని అనుకోకూడదు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి పట్టుకోవడం ఖాయం. అలా ఎప్పుడో 30 ఏళ్ల కింద జరిగిన ఒక ఘటనకు సంబంధించిన నేరస్తుణ్ణి ఇప్పుడు పట్టుకున్నారు. 30 ఏళ్ల క్రితం ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి, హత్యచేశాడో మానవ మృగం. ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు పోలీసులకు సవాల్ విసిరాడు. ముపై ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఈ సైకో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అయితే అతనిని ఒక కండోమ్ పట్టించింది. కండోమ్ ఎలా పట్టించింది అనుకుంటున్నారా..చెబుతా వినండి.

Image result for condom

అమెరికాలోని ఇండియానా రాష్ట్రం ఫోర్ట్‌వైనే నగరంలో 1988 ఏప్రిల్ 1 వ తేదీన 8 ఏళ్ల చిన్నారి ఏప్రిల్ టిన్‌స్లే అదృశ్యమైంది. ఆ చిన్నారి అదృశ్యమైన ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహం దొరికింది. బాలికపై నిందితులు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అంతేకాదు ఆ చిన్నారి మృతదేహన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. అయితే చిన్నారిని హత్య చేసిన నిందితుడు మాత్రం పోలీసులకు దొరకలేదు. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకొన్నారు. అయితే ఈ కేసు విచారణ సాగుతున్న సమయంలోనే నగరంలోని ఓ గోడపై చిన్నారిని మరోసారి చంపుతా ఆమె మరో షూ నా వద్దే ఉందంటూ, నిందితుడు రాశాడు.30 ఏళ్లుగా ఈ కేసు విచారణ సాగుతోంది.

అయితే ఈ కేసు దర్యాప్తు సమయంలో అన్ని రకాల కోణాల్లో పోలీసులు దర్యాప్తును సాగించారు. అయితే చివరకు జన్యు శాస్త్రవేత్తల సహాయాన్ని తీసుకొన్నారు. జన్యు శాస్త్రవేత్తల సహాయం తీసుకొన్న సమయంలో ఇద్దరు అనుమానితులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. గ్రాబిల్‌కు చెందిన జాన్ మిల్లర్, అతని సోదరులపై పోలీసులు నిఘాను ఉధృతం చేశారు. ఈ నెల మొదటి వారంలో జాన్ మిల్లర్ ఇంటి డస్ట్ బిన్ నుండి కండో‌మ్‌లను సేకరించారు. ఈ కండో‌మ్‌లను పరీక్షించారు. 30 ఏళ్ల క్రితం బాలికపై అత్యాచారం సందర్భంగా నిందితుడి వీర్యంతో ఈ కండోమ్‌లోని వీర్యం కూడ సరిపోయింది. ఈ ఆధారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో నిందితుడు పోలీసులను చూసి 30 ఏళ్ల క్రితం చిన్నారిని హత్య చేసింది తానేనని ఒప్పుకొన్నాడు. నిందితుడు మిల్లర్ అలెన్ కౌంటీ జైలులో ఉన్నాడు. వచ్చే వారం ఈ కేసు విచారణ సాగనుంది.చూసారుగా కండోమ్ ఎలా పట్టించిందో. మరి కండోమ్ నేరస్తుడిని పట్టించిన విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.