భార్య పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతోందని తెలిసి ఈ కలెక్టర్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడో

470

కాపురం అన్నాక భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు వస్తుంటాయి. కొన్నివిషయాల్లో భర్త, మరికొన్ని విషయాల్లో భార్య సర్దుకుపోతే సమస్యలు వాటంతట అవే సమసిపోతాయి. కానీ అలా సర్దుకుపోకుండా ఈ మధ్య చాలా మంది భార్య భర్తలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు.అలా విడాకులు తీసుకోవడం వలన జీవితంలో చాలా నష్టపోతున్నారు.కొందరు అయితే చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు తీసుకుంటున్నారు.అలా ఓ వ్యక్తి విచిత్రమైన కారణం చెప్పి విడాకులకు దరఖాస్తు చేశాడు. అతను మాములు వ్యక్తి ఏమి కాదు ఏకంగా ఒక జిల్లాకు కలెక్టర్.మరి అతను ఎందుకు విడాకులు తీసుకున్నాడు. అసలు కారణం ఏమి చెప్పాడు.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ జామూయి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు 2015 మార్చి 11 న పాట్నాకు చెందిన యువతి వత్సలతో పెళ్లి అయ్యింది.. వివాహ సమయంలో ఆమె చదువుతుండటంతో ఆమె ఢిల్లీలోనే కొంత కాలం ఉంది. చదువు పూర్తి అయిన తర్వాత తిరిగి భర్త వద్దకు వచ్చింది. కొత్తల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. వత్సల ఢిల్లీలో ఉండడంతో మోడరన్ దుస్తులు ధరించేది. ఇంగ్లీషు కూడా బాగా మాట్లాడేది. పొట్టి పొట్టి షార్టులు వేసుకొని తిరుగుతుందని ధర్మేంద్ర అసహానానికి గురయ్యాడు. తాను కలెక్టర్ నని అలా తిరగవద్దంటూ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదు. దీంతో ధర్మేంద్ర కుమార్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.ఇంగ్లిష్ లో మాట్లాడుతూ వత్సల తనను అవమానిస్తోందనీ, పొట్టిపొట్టి బట్టలు వేసుకుని వీధుల్లో తిరుగుతోందని ఆరోపించాడు. తాను ఎంతగా నచ్చజెప్పినా వినడం లేదని వాపోయాడు. మరోవైపు తన భర్త చెప్పేది వాస్తవం కాదని వత్సల తెలిపింది. కాపురంలో గొడవలపై మాట్లాడేందుకు తాను తల్లితో కలిసి ఇంటికిరాగా గార్డులు అడ్డుకున్నారని పేర్కొంది.

Related image

ధర్మేంద్ర కుమార్ తనకు అన్యాయం చేస్తున్నారనీ, ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వివాదాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ధర్మేంద్ర ప్రకటించారు.ఆయనమే కలెక్టర్ ఆమెనేమో పోస్ట్ గ్రాడ్యూయేట్. ఇద్దరూ విద్యావంతులే. సమాజంలో పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా బజారుకెక్కి పోట్లాడుకోవడంతో అంతా చర్చనీయాంశమైంది. వత్సల మాత్రం తాను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి సాధారణంగా ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నాను కానీ బయటికి వెళ్లలేదన్నారు. కలెక్టర్ భార్యగా అతని గౌరవ మర్యాదలు కాపాడానే కానీ ఆయన అవమాన పడే విధంగా తాను చేయలేదన్నారు. తన భర్త ఇలా ఎందుకు చేస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదని వత్సల తెలిపింది. తాను చేయకూడని తప్పేమి చేశానని ప్రశ్నించింది. తాను కూడా చదువుకున్నానని తనకు అన్ని తెలుసని వత్సల తెలిపింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తాను గొడవలకు సంబంధించి మాట్లాడడానికే తన తల్లితో వచ్చానని కానీ గార్డులు తనను అడ్డుకున్నారని తెలిపింది. అందుకే తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు బైటాయిస్తానని తెలిపింది. తాను తన భర్తతో కలిసి ఉండేందుకు సిద్దంగా ఉంన్నానని తన భర్త కూడా అర్ధం చేసుకోవాలని కోరింది. కలెక్టర్ తీరును మరికొంత మంది తప్పు పడుతున్నారు. అన్ని తెలిసిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఏమైనా వివాదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా బజారుకెక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. భార్య పొట్టి బట్టలు వేసుకుందని విడాకులకు అప్లై చేసిన భార్య గురించి అలాగే ఇలా విచిత్ర కారణాలకు విడాకులు తీసుకునే వ్యక్తుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.