ప్రాణాలు తీస్తున్న సెల్ ఫోన్లు… ఇద్దరు అమ్మాయిలు సూసైడ్…

271

ప్రస్తుతం సెల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ సామాన్యుడికి అందుబాటులోకి రావడంతో అందరూ కూడా సెల్ వినియోగం మరింత పెంచారు. ఇక చిన్న, పెద్ద అనే వయోబేధం లేకుండా చాలా మంది సెల్ ను వినియోగిస్తున్నారు. ఇప్పుడు సెల్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కొందరు తల్లి తండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుండి సెల్ అలవాటు చేయడంవల్లనే వారి మనసు చెడిపోతోందని, తద్వారా వారు చదువుల మీద శ్రద్ధ పెట్టక, భవిష్యత్తు కూడా పాడవుతుంది అని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సెల్ వాడొద్దు అని అన్నందుకు తమ నిండు ప్రాణాలు సైతం బలి చేసుకుంటున్నారు.ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. మరి ఆ ఘటనల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls playing mobile

హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో నివసించే సంహిత అనే బాలిక సెల్ ఫోన్ తో ఆడొద్దన్నారని ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెను సంచలనం రేపింది. నగరంలోని ఒక ప్రైవేట్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్న సంహితకు సెల్ ఫోన్ లు అన్నా, సెల్ ఫోన్ తో ఆడడం అన్నా చాలా ఇష్టం.అయితే రోజూ స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చిన ఆమె హోమ్ వర్క్ కూడా చేయకుండా గంటల తరబడి సెల్ తో ఆడటం గమనించిన ఆమె తల్లి తాత ఒక రోజు గట్టిగా మందలించారు. అలా సెల్ అతిగా వినియోగించడం మంచిది కాదని, ఇకపై చదువుమీద దృష్టి పెట్టమని గట్టిగా మందలించడంతో, నిన్న స్కూల్ నుండి తిరిగివచ్చిన సంహిత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మీద ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సెల్ ఫోన్ వద్దనందుకే చనిపోయిందా లేదా వేరే కారణాలు ఉన్నాయా అని విచారిస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఈ ఘటన ఇలా ఉంటె ఇలాగె మరొక అమ్మాయి కూడా ఫోన్ వద్దనందుకు ఆత్మహత్య చేసుకుంది. సనత్ నగర్ కు చెందిన స్నేహ అనే మరొక విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్నేహ ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గదిలోకి వెళ్లిన స్నేహ ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో తలుపులు గట్టిగా బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్ కు ఉరివేసుకున్న ఆమె వేలాడుతూ కనపడింది. ఆ దుర్ఘటనను చూసిన తల్లితండ్రులు ఒక్కసారిగా కూలపడిపోయారు. అసలు తాము పెద్దగా మందలించలేదని, సెల్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, బాగా చదువుకుని పైకివస్తే జీవితం ఆనందంగా ఉంటుందని మాత్రమే చెప్పమని, ఇంత చిన్న విషయానికి నిండు ప్రాణాన్ని తీసుకుంటుందని అనుకోలేదని వారు భోరున విలపిస్తున్నారు. ఇలా సెల్ ఫోన్ కోసమని ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. మరి ఈ రెండు ఘటనల గురించి అలాగే సెల్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్న యువత గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.