కొండగట్టు ప్రమాదం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన బస్ కండక్టర్

436

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 62 మందికి పైగా మృతి చెందారు. శనివారంపేట నుంచి జగిత్యాల వెళ్తున్న బస్సు కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడింది.మరో నిమిషంలో మెయిన్ రోడ్డు పైకి చేరుకుంటుందనే సమయంలోనే ఈ పెను ప్రమాదం సంభవించింది. బస్సు కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పడంతో ప్రయాణీకులు కంగారుపడి ఓ వైపుకు ఒరగడంతో బస్సు లోయలో పడినట్లుగా చెబుతున్నారు.అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన బస్సు కండక్టర్ పరమేశ్వర్ బస్సు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పాడు.మరి ఆయన ఈ ప్రమాదం గురించి ఏం చెప్పాడో చూద్దామా.

Image result for bus accident

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చించి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌తో పాటు 62 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే ఈ ప్రమాదం పూర్తిగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి స్పందించారు గాయాలతో బయటపడ్డ కండక్టర్‌ పరమేశ్వర్‌.కొండ గట్టు ప్రమాదానికి బ్రేకులు ఫెయిల్ అవ్వడమే కారణమని ఆ బస్సు కండక్టర్ తెలిపారు.ప్రమాదానికి ముందు మూడు స్పీడ్ బ్రేకర్లు వచ్చాయని అప్పుడు బ్రేక్ వేస్తే బస్సు కంట్రోల్ అవ్వలేదని కండక్టర్ చెప్పారు. స్పీడ్ బ్రేకర్లు దాటాక బస్సు వేగం మరింత పెరిగిందని తెలిపారు.బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయో గేరు న్యూట్రల్ ‌లో ఉందో తెలియదని అన్నారు.

Image result for bus accident

ఆ మరుక్షణమే బస్సు వేగంగా లోయలోకి దూసుకెళ్ళిందని కండక్టర్ తెలిపారు. డ్రైవర్‌కు ఘాట్ రోడ్డు కొత్తేమీ కాదనీ ఎక్కడెక్కడ మలుపులు ఉన్నాయో ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో బాగా తెలుసని వివరించారు. ప్రయాణానికి ముందు బస్సుకు ఫిట్ నెస్ తనిఖీలు చేశారో లేదో తనకు తెలియదని కండక్టర్ చెప్పారు.ఘాట్‌ రోడ్డులో బ్రేక్‌ ఫెయిల్‌ అయి ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బస్సు చివరలో ఉన్నానని చెప్పారు.ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్‌ గట్టిగా అరిచాడని తెలిపారు. బస్సు కండీషన్‌ పై, ప్రయాణికుల రద్దీపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమపై ఒత్తిడి పెంచినట్టు తెలిపారు.ప్రమాద సమయంలో బస్సులో వంద మందికిపైనే ఉన్నారని కండక్టర్ చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బస్సులో 96 మందికి టిక్కెట్లు ఇచ్చానని వివరించారు.నలుగురు చిన్నపిల్లలు కాగా, ఏడు ఎనిమిది మందికి పాసులు ఉన్నాయని జెఎన్టీయూ వద్ద బస్సు ఎక్కిన ఆరుగురికి ఇంకా టికెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తుచేసుకున్నారు.శ్రావణ మాసం ప్రారంభమయ్యాకే ఘాట్ రోడ్డులో బస్సు నడుపుతున్నామనీ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు ఆ రూట్‌లో సర్వీసు నడుస్తోందని కండక్టర్ తెలిపారు. నెల రోజులు నుంచి కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు నడుస్తున్నట్లు కండక్టర్ తెలిపారు.ఇదేనండి బస్సు ప్రమాదం నుంచి బయటపడిన బస్సు కండక్టర్ చెప్పిన విషయాలు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదం గురించి అలాగే ప్రమాదం నుంచి బయటపడిన బస్సు కండక్టర్ చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.