రాఖి పండగ రోజు దారుణం.. ఏం జరిగిందో చూస్తే షాకవుతారు

560

నిన్న దేశం మొత్తం రాఖీ సెలెబ్రేషన్ లో మునిగిపోయారు.ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఆనందంగా గడిపారు.సోదరుడు ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి వెళ్లి మరీ రాఖీ కట్టి సోదరుడి దీవెనలు తీసుకున్నారు.రాఖీ కడుతుంటే ఏ సోదరైనా సంతోషంతో ఉబ్బితబ్బిబవుతుంది. కానీ ఆ అక్క మాత్రం పుట్టెడు దుఃఖంతో కట్టింది. నిర్జీవంగా ఉన్న తమ్ముడికి కడసారి రాఖీ కడుతూ ఇక రాడు అనే మాటను మనసులోనే దాచుకుని మౌనంగా రక్షాబంధనాన్ని కట్టేసింది.వింటుటేనే కళ్ళలో నీళ్ళు వచ్చే ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for rakhi

కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొక్కొండ గిరిబాబుకు వినోద్, శిరీష అని ఇద్దరు సంతానం.శిరీష పెద్దది కాగా వినోద్ చిన్నవాడు.వినోద్ సత్తుపల్లిలో డిప్లొమా చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవాడు. రాఖీ పండుగ ఉండటంతో ఇంటికొచ్చాడు.అయితే ఇంట్లో బోర్ కొడుతుంటే ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక సత్తుపల్లిలో తనతో కలిసి చదువుకున్న హిమకిరణ్‌ తో కలిసి అలా బయటకు వెళ్ళాడు.వారిద్దరూ కలిసి సరదాగా అక్కడికి సమీపంలోని బేతుపల్లి చెరువుకు కార్లో వెళ్లారు.వర్షాలు బాగా పడడంతో ఆ చెరువులో నీరు చాలా ఎక్కువగా ఉన్నాయి.అలుగు పోస్తుంది ఆ చెరువు.ఇది గమనించని వినోద్ చెరువులో కారును పోనిచ్చాడు.దీంతో కారు అదుపు తప్పి చెరువులో పడింది.

ఇద్దరూ కారు డోర్లు తెరుచుకొని అతికష్టం మీద బయటకొచ్చే ప్రయత్నం చేశారు.అయితే బయటకు వచ్చే సమయంలో వినోద్ ఫోన్ కింద పడిపోవటంతో దాన్ని అందుకునే క్రమంలో అతడు నీటిలో గల్లంతయ్యాడు.అతడి మృతదేహం ఆదివారం లభ్యమైంది.చెరువులోంచి ఆయన మృతదేహాన్ని ఆదివారం బయటకు తీశారు. వినోద్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.మార్చురీలో విగత జీవిగా పడి ఉన్న తమ బిడ్డను చూడలేక ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా ఏడ్చారు. తమ్ముడిని నిర్జీవంగా చూసిన అక్క శిరీష కన్నీరు మున్నీరయ్యింది. అందులోనూ ఆదివారం రాఖీ పండగ కావడం ఆ ఇంట మరింత విషాదం నింపింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

‘ఒరేయ్‌ తమ్ముడూ.. నాకు అండగా ఉంటావనుకున్నాన్రా.. రాఖీ కట్టించుకోకుండా వెళ్లావేంట్రా…?’’ అంటూ అక్క శిరీష గుండె బాదుకుంటూ ఏడుస్తుంటే చూసేవారు అంత కన్నీరుమున్నీరు అయ్యారు.వెంటనే తేరుకుని తన తమ్ముడి కడసారి చూపుకు రాఖీతో కన్నీటి వీడ్కోలు పల్కింది.విన్నారుగా రాఖీ కట్టించుకోవడం వచ్చి చివరికి ఎలా విగతజీవిగా మారాడో.కాబట్టి చెరువుల దగ్గరకు నదుల దగ్గరకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.రాఖీ పండుగ రోజునే సోదరుడిని కోల్పోయి ఆ సోదరి పడుతున్న బాధ గురించి అలాగే ఈ పూర్తీ సంఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.