అరగంటలో పెళ్ళి..పెళ్ళి దుస్తుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కేసు పెట్టిన పెళ్ళి కూతురు

253

అచ్చం 20 వ దశకాల్లో వచ్చిన సినిమాల్లాంటి సీన్ ఇది..సరిగ్గా తాళి కట్టడానికి కొన్ని క్షణాల ముందు కోటి రూపాయల కట్నం అడిగాడు వరుడు..పెళ్ళి పీటలపై కూచొని కట్నం లోనుంచి తనకు రావాల్సిన బాకీ ఏదని నిలదీసాడు..అది ఇస్తే గాని తాలి కట్టనని భీష్మించాడు.. వరుడు తీరుకు షాక్ కు గురయి పెళ్ళి పీటల మీద తలవంచుకు కూచొని గుడ్లలో నీళ్ళు కుక్కుకోలేదా వధువు..వరుడ్ని బ్రతిమలాడుతూ గెడ్డం కాళ్ళు పట్టుకొని బుజ్జగించనూ లేదు..ఆమె తల్లి దండ్రులు..నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు..వరుడిపై ఫిర్యాదు చేసారు..లిఖిత పూర్వకంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వరుడు అతని తల్లిదండ్రులపై కేసును నమోదు చేసారు..ఈ ఘటన ఒడిసా లోని డెంకనాల్ జిల్లాలో చోటు చేసుకుంది..

Image result for bride girl went to police station

జిల్లాలోని మోతుంగా తెహ్సీల్ పరిధిలోని నాధార్ గ్రామానికి చెందిన స్వర్ణమయి నాయక అనే యువతికి అదే జిల్లాలోని కరాడా గడియా గ్రామానికి చెందిన శాంతి స్వరూప్ దాస్ తో వివాహం నిశ్చయమయింది..శాంతి స్వరూప్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. వధువు తల్లిదండ్రులు కాస్త డబ్బు ఉన్నవరే..దీంతో కోటి రూపాయలు కట్నంగా ఇవ్వడానికి అంగీకరించారు..మూడు విడతల్లో 75 లక్షల రూపాయలు ఇచ్చేసారు కూడా..పెళ్ళి నాటికి మరో 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది..ఆ మొత్తం సర్దుబాటు కాకపోవడంతో ఇవ్వలేకపోయారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

దీంతో కోటి రూపాయలను మొత్తంగా ఇస్తే కాని తాళి కట్టబోనని పెళ్ళి పీటలమీదే భీష్మించాడు శాంతిస్వరూప్ దాస్..స్వర్ణమయి నాయక్ తండ్రిని పిలిచి మొత్తం డబ్బులు ఇవ్వకపోతే తన కుమారుడు తాళి కట్టడని పెళ్ళి కొడుకు తండ్రి హెచ్చరించాడు..నేరుగా మోతుంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి వరుడిపై ఫిర్యాదు చేసారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్ళి మంటపానికి చేరుకునే లొపౌ శాంతి స్వరూప్ దాస్ జంప్ అయిపోయాడు..అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు..చూసారు కదా పెళ్ళి కూతురు చేసిన పనిని ఆమె ధైర్యాన్ని..నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి..కట్నాల కోసం పెళ్ళిల్లు చేసుకునే ఇలాంటి వారికి ఇలానే సమాదానం చెప్పాలి..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..