కేరళ వరదల్లో పెళ్లి కోసం ఈ నవవధువు ఎంత పని చేసిందో చూడండి

428

కేరళలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ వర్షాలతో రాష్టం అస్తవ్యస్తం అయ్యింది.లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతక ముందు ప్రకృతికి అందం కేరళ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రకృతి విలయతాండవం చేసి అక్కడి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.అక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.ఇలాంటి పరిస్థితిలో కూడా ఒక నవ వధువు చేసిన సాహసం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.మరి ఆ నవవధువు చేసిన సాహసం ఏమిటో తెలుసుకుందామా.

Image result for kerala flood new married couple

కేరళ రాష్టం అప్పచిమేడు గ్రామానికి చెందిన 24ఏళ్ల రాసత్తికి సిరుముగయ్‌ ప్రాంతానికి చెందిన రంజిత్‌ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. ఆగస్టు 20న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.అయితే వివాహ వేదిక వద్దకు చేరాలంటే రాసత్తి కుటుంబం పంబనదిని దాటాలి. నదిపై ఎలాంటి వంతెన లేకపోవడంతో పడవల ద్వారానే రాకపోకలు జరుపుతుంటారు. ప్రస్తుత వర్షాల కారణంగా ఆ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.వరదల కారణంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారని మన అందరికి తెలిసిందే.అధికారులు పడవ ప్రయాణాలను కూడా నిలిపివేశారు.అయితే వివాహం నేపథ్యంలో రాసత్తి కుటుంబం అధికారులను సంప్రదించి పరిస్థితిని వివరించింది.వరదలు ఉన్నా సరే నది దాటేందుకు ప్రత్యేక అనుమతి కోరింది.ముందు అధికారులు అంగీకరించలేదు.వెళ్తే చనిపోతారని చెప్పారు.అయినా కానీ ఆ పెళ్ళికూతురు అస్సలు వినలేదు.ఎట్టిపరిస్థితిలో వెళ్ళాలి అని పట్టుబట్టింది.తప్పని పరిస్థితి కావడంతో అధికారులు కూడా అంగీకరించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ క్రమంలో శుక్రవారం వధువు రాసత్తి సహా 10 మంది కుటుంబసభ్యులు తెప్పల్లో అవతలి ఒడ్డుకు సురక్షితంగా చేరుకున్నారు. తమ ప్రయాణం క్షేమంగా సాగడంతో రాపత్తి ఆనందం వ్యక్తం చేసింది.తన పెళ్లి కోసం అధికారులు అనుమతులు ఇచ్చినందుకు వారికి రాపత్తి ధన్యవాదాలు తెలిపారు. అయితే, తమ ప్రాంతానికి వంతెన లేకపోవడంతో ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వంతెన సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.వరదల భీభత్సం తగ్గాకా తమకు వంతెన నిర్మించాలని ఆమె కోరారు.తమ ప్రయాణం సురక్షితంగా సాగినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు.విన్నారుగా పెళ్లి కోసం ఈ వధువు వరదలను కూడా లెక్క చెయ్యకుండా ఎలాంటి సాహసం చేసిందో.మరి ఈ వదువు చేసిన సాహసం గురించి అలాగే కేరళను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఈ వరదల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.