బాయ్ ఫ్రెండ్ చెప్పాడ‌ని యూట్యూబ్ లో వీడియో చూస్తూ అలా ట్రై చేసింది చివ‌రికి తల్లిదండ్రుల‌కు షాక్

220

ఇటీవ‌ల ఏది అయినా స‌రే మ‌నకు తెలియ‌క పోతే వెంట‌నే యూట్యూబ్ ఓపెన్ చేయ‌డం, మ‌న‌కు తెలియ‌ని విష‌యాలు అందులో నేర్చుకోవ‌డం జ‌రుగుతోంది.. ఎడ్యుకేష‌న్ ప‌రంగా అనేక విష‌యాలు మ‌నం తెలుసుకోవ‌చ్చు. అయితే కొంద‌రు వీటిని మంచిగా తమ ఎదుగుద‌ల‌కు ఉప‌యోగించుకుని బాగా సంపాద‌న సంపాదిస్తున్నారు. ఉన్న‌త విద్యావంతులు అవుతున్నారు. అయితే కొంద‌రు మాత్రం పిచ్చి ప‌నులు చేస్తూ, ఎవ‌రూ ట్రై చేయ‌ని విధంగా ట్రై చేస్తున్నారు..గ‌తంలో తిరుపూర్‌కు చెందిన కృతిక టీచర్‌గా పనిచేసేవారు. ఆమె భర్త కార్తికేయన్ స్నేహితుడైన ప్రవీణ్ సలహా మేరకు కృతిక ఆస్పత్రికి వెళ్లలేదని తెలుస్తోంది. తన భార్యకు సహజ కాన్పు అయిందని, వాళ్లు కూడా ఇంట్లోనే కాన్పుకు ప్రయత్నిస్తే మంచిదని ప్రవీణ్, అతడి భార్య లావణ్య కలిసి కార్తికేయన్ దంపతులకు సలహా ఇచ్చారు.

Image result for watching videos

కార్తికేయన్ కూడా దానికి అంగీకరించడంతో కృతిక గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలలూ ఆస్పత్రికి వెళ్లలేదు. ప్రసవ సమయంలో ఇబ్బంది తలెత్తడంతో ముగ్గురూ కలిసి యూట్యూబ్‌లో వీడియోలను చూసి కృతికకు ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు.. కానీ ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువగా జరగడంతో ఆమె చనిపోయారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ఇలాంటివి ఎవ‌రూ ట్రై చేయ‌వ‌ద్దు అని అప్పుడు డాక్ట‌ర్లు పెద్ద ఎత్తున చెప్పారు ఇప్పుడు ఇలాంటి మ‌రో ప్ర‌య‌త్నం చేసింది ఓ అమ్మాయి.వీడియో చూస్తూ సొంతంగా ప్రసవానికి ప్రయత్నించిన ఓ 25 ఏళ్ల యువతి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ పరిధిలో చోటుచేసుకుంది. బహ్రయిచ్‌ ప్రాంతానికి చెందిన సదరు యువతి గత నాలుగేళ్లుగా గోరఖ్‌పూర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో వివాహేతర సంబంధంతో గర్భం దాల్చింది. ఈ విషయం ఎవరికి తెలియవద్దని గదిలో ఒంటరిగా వీడియో చూస్తూ ప్రసవానికి ప్రయత్నించింది. ఇది వికటించడంతో తీవ్ర రక్తస్రావానికి గురై ప్రాణాలు కోల్పోయింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇటీవలనే కొత్త రూంను ఆమె అద్దెకు తీసుకోగా.. ఆదివారం ఆ రూం నుంచి రక్తం రావడం చుట్టూ పక్కల వాళ్లు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తంమడుగులో ఉన్న పసికందును, యువతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. యువతి కుటుంబ సభ్యులెవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. మొత్తానికి ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎన్ని జ‌రుగుతున్నా ఇంకా మార్పు రాక‌పోవ‌డం పై డాక్ట‌ర్లు విస్మ‌యం చెందుతున్నారు, చూశారుగా ఇలాంటి విష‌యాల‌లో డాక్ట‌ర్ల స‌ల‌హా త‌ప్ప‌నిస‌రి అని ప్రెగ్మెంట్ గా ఉన్న మ‌హిళ‌ల‌కు తెలియ‌చేయండి.