తల్లిదండ్రులకు హెచ్చరిక : వాషింగ్‌ మెషిన్‌లో చిక్కుకున్న బాలుడు…తరువాత ఎంత ఘోరం జరిగిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

360

చిన్నపిల్లలు ఏమి తెలియని అమాయకులు.వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు.అది చేస్తే ప్రమాదం వస్తుందని దానివలన ప్రాణాలు పోతాయని కూడా వాళ్లకు తెలియదు.అందుకే పిల్లలకు ఏమి అవసరం ఉన్నా తల్లిదండ్రులే చూసుకోవాలి.వారి తిండి నుంచి ఆడుకునే ఆటల వరకు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకుంటే వాళ్లకు ఏమైనా అవ్వొచ్చు.ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు హెచ్చరిక.ఈ ఘటన విన్నాక అయినా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని ఆశిస్తూన్నాం.మరి ఏం జరిగిందో తెలుసుకుందామా.

యూఏఈలోని ఆజ్మాన్‌లో నివసించే ఓ నాలుగు ఏళ్ల బాలుడి తల్లి బయటకు వెళ్తూ పిల్లాడిని అల్‌ రవాదాలో నివాసం ఉంటున్న అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్లింది. అయితే బాలుడు తనను ఎవరు గమనించని సమయంలో లాండ్రీ రూమ్‌కు చేరుకున్నాడు. అక్కడున్న ఫ్రంట్‌ డోర్‌ వాషింగ్‌ మెషిన్‌లో ఎముందనుకున్నాడో తెలియదు గానీ.. బాలుడు అందులోకి దూరాడు. ఆ తర్వాత డోర్‌ మూసేసుకున్నాడు. వెంటనే అటోమేటిక్‌గా వాషింగ్‌ మెషిన్‌ స్టార్ట్‌ అయింది. ఒక్కసారిగా వేడి నీళ్లు మెషిన్‌లోకి చేరడం, మెషిన్‌ తిరగడం ప్రారంభం కావడంతో.. అందులో చిక్కుకున్న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో బాలుడి అంకుల్‌ కూడా ఇంట్లోనే ఉన్నాడు.

కాగా, బయటికి వెళ్లి వచ్చిన బాలుడి తల్లి.. అతని కోసం వెతుకుంతుడగా కనిపించలేదు. వాషింగ్‌ మిషన్‌ తిరుగుతూ ఉండటంతో అనుమానం వచ్చి దాన్ని ఆపివేశారు. ఆ తర్వాత డోర్‌ తెరచి చూస్తే బాలుడు ఘోరమైన స్థితిలో శవమై కనిపించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్ట తెలిపారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై అప్రమత్తతో వ్యవహరించాలని సూచిస్తున్నారు.చూశారుగా ఈ బాలుడికి ఏం జరిగిందో.అందుకే ప్రతి తల్లిదండ్రి జాగ్రత్తగా ఉండండి.మీ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండండి.లేకుంటే మీ ఇంట్లో కూడా ఇలాగే జరగొచ్చు.