హైద‌రాబాద్ లో హైటెక్ వ్య‌భిచారం అడ్డంగా దొరికిపోయిన అందాల భామలు

449

మసాజ్‌ అంటే శరీరానికి ఉపశమనం కల్పించడంతో పాటు నొప్పులకు తాత్కాలిక వైద్యంగా భావిస్తారు. గతంలో వీటికోసం ప్రత్యేక కేంద్రాలు లేనప్పటికీ ఆధునిక సమాజంలో మసాజ్‌ సెంటర్ల పేరిట సాధారణ వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. పురుషులకు పురుషులు, మహిళలకు మహిళలు మసాజ్‌ చేసేలా కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ విధానాన్నే ఆసరాగా తీసుకున్న కొంతమంది స్పా పద్ధతిలో ముందుకు వస్తున్నారు. క్రాస్‌ జెండర్‌ మసాజ్‌ (పురుషులకు మహిళలు లేదా మహిళలకు పురుషులు) పేరిట పుట్టుకొస్తున్న ఈ కేంద్రాలతో విషయం చర్చనీయాంశంగా మారింది.

Image result for prostitute

ఇలాంటి కార్యకలాపాలు చెడును ప్రోత్సహిస్తున్నాయంటూ దశాబ్దం క్రితమే క్రాస్‌ మసాజ్‌లను నిషేధించారు. అయినా తీరుమారని కొంతమంది బ్రోకర్లు ఇప్పటికీ మసాజ్‌ సెంటర్‌ అని బోర్డు పెట్టి క్రాస్‌ మసాజ్‌ల దందా చేయడంతో పాటు మరో అడుగు ముందుకు వేసి గుట్టుగా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మసాజ్‌ సెంటర్‌ అంటే అనుమానం రాదని భావిస్తూ హైటెక్‌ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు దాడులు జరిపే పోలీసులు ఒకరిద్దరినీ అరెస్టు చేసినా.. ఇలాంటి సెంటర్లు వందల సంఖ్యలో ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా ఇలాంటి దందా గుట్టు ర‌ట్టైంది…స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోన్న పార్లర్‌లపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు.

Image result for prostitute

ఆదివారం సాయంత్రం నాచారం ప్రాంతంలో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా ఎస్సెన్స్ స్పాలో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు నిర్వాహాకులతో పాటూ.. ఇద్దరు విటులు, మరో ముగ్గురు యువతుల్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ. 8వేలు డబ్బు, 6 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.ఎస్సెన్స్ స్పాలో మసాజ్‌ల పేరుతో విటుల్ని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. పైకి మాత్రం స్పాలా బిల్డప్ ఇచ్చి.. లోపల మాత్రం యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పక్కా సమాచారంతో దాడులు చేశారు.. అరెస్ట్ చేసిన యువతుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అలాగే నిర్వాహకుల్ని కూడా ప్రశ్నించారు. స్పాలు, మసాజ్ సెంటర్ల పేరుతో ఎవరైనా వ్యభిచారం నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కొన్ని దేశాల్లో.. కొన్ని ఇతర రాష్ట్రాల్లో చట్టబద్ధంగా నడుస్తున్న ఈ క్రాస్‌ మసాజ్‌ సెంటర్ల క్రేజు మన నగరంలోనూ రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. చాలా పకడ్బందీగా ఈ దందా చేస్తున్న నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించడంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వ్యభిచారం అనే చట్టవ్యతిరేక పదం వాడకుండా… చాలా తెలివిగా మసాజ్‌ సెంటర్‌ అని పేరు పెడుతున్నారు. స్పా సెంటర్లు, మసాజ్‌ సెంటర్లను నిర్వహించడం తప్పు కాదు. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని వ్యభిచారం నిర్వహించడమనేదే సమాజానికి నష్టం. చట్టవ్యతిరేకం కూడా.. మసాజ్‌ పేరిట దందా సాగిస్తూ అందులోనే వ్యభిచార గృహాలు, క్రాస్‌ మసాజ్‌లు నిర్వహిస్తున్నారు. వాటికి ఆన్‌లైన్‌లో, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మ‌రి ఇలాంటివి మీరు ఎక్క‌డైనా గుర్తిస్తే క‌చ్చితంగా పోలీసుల‌కు స‌మాచారం అందించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.