విజయవాడలో దారుణం..అక్రమ సంబంధం పెట్టుకున్న బ్యూటిషియన్‌పై హత్యాయత్నం..షాకింగ్ నిజాలు

522

దేశంలో ఎక్కడ చుసిన అక్రమ సంబంధ ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి.ప్రతిరోజు ఎన్నో కేసులు బయటపడుతున్నాయి.అక్రమ సంబంధం పెట్టుకోవడం భర్తనో భార్యనో చంపడమో చేస్తూనే ఉన్నారు.అయితే కొన్ని కేసుల్లో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళను కూడా చంపుతున్నారు.ప్రతిరోజు ఇలాంటి వార్తల గురించి వింటూనే ఉన్నాం.ఇప్పుడు ఇలాంటి మరొక ఘటన చోటుచేసుకుంది.ఇద్దరికీ పెళ్ళైన కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నారు.కానీ చివరికి ప్రియుడి చేతిలోనే ఆమె ప్రాణాలు పోయే స్థితికి వచ్చింది.మరి ఆ ఘటన గురించి పూర్తీ వివరాలు తెలుసుకుందామా.

Image result for girls depression

విజయవాడలోని హనుమాన్ జంక్షన్‌లో దారుణం చోటు చేసుకుంది. వైష్ణవి బ్యాటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌‌గా పని చేస్తున్న పిల్లి పద్మ అనే మహిళపై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం రాత్రి ఆమె కాళ్లను కట్టేసి కత్తులతో ఆమెను నరికారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తోంది. కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోన్న పద్మ నూతన్ కుమార్ అనే వ్యక్తితో కలిసి హనుమాన్ జంక్షన్లో నివసిస్తోంది. దీంతో ఆమె ప్రియుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.ఫోన్ ఎత్తకపోవడంతో కుమార్తెతోపాటు వచ్చి చూడటంతో పద్మ రక్తపు మడుగులో కనిపించింది.వెంటనే స్థానికులకు ఈ విషయం చెప్పాడు.

Image result for girls depression

వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని 108 ద్వారా చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ విషయం గురించి ఆమె భర్త మీడియాకు తెలియజేశాడు.నాలుగేళ్ల క్రితం నూతన్ కుమార్‌తో నా భార్య పద్మకు సంబంధం ఏర్పడిందని అప్పటినుంచి నాతో దూరంగా ఉంటుందని ఆయన తెలిపాడు.నూతన్ కుమార్‌కు కూడా ఇదివరకే పెళ్లయ్యిందని సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె హనుమాన్ జంక్షన్‌లో అతనితోనే ఉంటోందని అప్పుడప్పుడు తన దగ్గరకు వస్తోందని తెలిపాడు.నువ్వు లేకుంటే నేను చనిపోతానని నూతన్ తన భార్యను వేధించేవాడన్నారు.ఈ విషయం గురించి నా భార్య నాతో కూడా చెప్పిందని ఆయన తెలిపాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇంటికి వచ్చి వేధించడంతో ఇప్పటికే రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.నూతన్ తాగి వచ్చేవాడని ఈ క్రమంలో వారిద్దరికీ గొడవలయ్యాయని తెలిపారు.ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని పద్మ తన కుమార్తెకు చెప్పిందన్నారు.అయితే ఇప్పుడు ఈమె ఇలా ఉండడం చూసి ప్రియుడే దీనికి పునుకున్నాడని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.చూశారుగా ప్రేమగా చూసుకునే భర్తను కాదని మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈమె గతి చివరికి ఏమైందో.కాబట్టి ఇలాంటి తప్పుడు పనుల జోలికి వెళ్ళకండి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు. ప్రియుడిని నమ్మి కట్టుకున్న భర్తను వదిలేసి చివరికి అతని చేతిలోనే చావును కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ పార్లర్ మహిళా గురించి అలాగే రోజురోజుకు పెరిగిపోతున్న ఈ అక్రమ సంబంధ ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.