నటుడు లక్ష్మీపతి కొడుకు ఎంత పెద్ద హీరోనో చూస్తే మీరు ఆశ్చర్యపోకుండా వుండలేరు

501

హీరోల‌కు ఎంత పేరు ఉంటుందో అంతే పేరు క‌మెడియ‌న్ల‌కు ఉంటుంది.. సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు చిన్న వ‌య‌సులోనే మ‌ర‌ణించారు.. కానివారు చేసిన కొద్ది సినిమాలు పెద్ద పెద్ద హీరోల లైఫ్ ని మార్చేశాయి అని చెప్పాలి.. వారే క‌మెడియ‌న్ ల‌క్ష్మిప‌తి, ద‌ర్శ‌కుడు శోభ‌న్.. తెలుగు తెర‌పై ల‌క్ష్మీ ప‌తి కామెడి అంటే ప‌డిప‌డి న‌వ్వుకోవాల్సిందే.. లక్ష్మీప‌తి పెళ్లి పీట‌లు సినిమాతో 1988లో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు… త‌ర్వాత సినిమా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో నాలుగు సంవ‌త్స‌రాలు ఆగారు… త‌ర్వాత చిన్న చిన్న సినిమాలు చేశారు.. ఇక 2001 లో మురారిలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.. ఈ సినిమాలో న‌టించి ఆ క్యారెక్ట‌ర్ తో మంచి మార్కులు సాధించుకున్నారు.. ఆ త‌ర్వాత ల‌క్ష్మీప‌తి వెన‌క్కి తిరిగిచూసుకోలేదు.. అల్ల‌రి – కిత‌కిత‌లు – ఆంధ్రుడు – బాబి- చంటి -నువ్వంటే నాకిష్టం ఇలాంటి హిట్ సినిమాల్లో న‌టించి, మంచి క‌మెడియ‌న్ గా పేరు తెచ్చుకున్నారు.

ఇక 2008 లో అంద‌మైన మ‌న‌సు సినిమాలో చివ‌ర‌గా ఆయ‌న న‌టించారు.. 2008 లో బాత్రూంలో హార్ట్ అటాక్ రావ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించాడు.. కాని రెండు రోజులు వ‌ర‌కూ ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో, వ‌చ్చి చూసేస‌రికి ఆయ‌న చ‌నిపోయి ఉన్నారు. ఇక ఆయన త‌మ్ముడు ద‌ర్శ‌కుడు శోభ‌న్ … టాలీవుడ్ లో అంద‌రికి తెలిసిన వ్య‌క్తి.. శోభ‌న్ 1989 లో త‌మిళ్ లో తెర‌కెక్కిన రౌడీయిజం అనే సినిమాకి ఆ యూనిట్ తో క‌లిసి ప‌నిచేశాడు.

త‌ర్వాత త్రిపుర‌నేని వ‌ర‌ప్ర‌సాద్ తో రైతు భార‌తం…రామ్ గోపాల్ వ‌ర్మ అన‌గ‌న‌గా ఒక‌రోజు ….కృష్ణ‌వంశీ సింధూరం, మురారి సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా పని చేశారు.. ఆ స‌మ‌యంలో మురారి సినిమాకు ఆయ‌నే మాట‌లు రాశారు.. ఆ సినిమా మ‌హేష్ బాబుకు ఎంతో ఫేమ్ తీసుకువ‌చ్చింది.. త‌ర్వాత న‌వ‌నీత అనే మ‌ల‌యాల సీరియ‌ల్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ఇక కొద్దిరోజుల త‌ర్వాత మ‌హేష్ బాబుతో బాబి సినిమాకి ద‌ర్శ‌క‌త్వం చేసి ప‌రాజ‌యం అందుకున్నాడు.. త‌ర్వాత ప్ర‌భాస్ తో
వ‌ర్షం సినిమా తీశాడు శోభ‌న్.. ఇందులో ప్ర‌భాస్ పాత్ర అత‌ని డైలాగ్స్ కు ఎంతో పేరు వచ్చింది.. వాస్త‌వంగా ప్ర‌భాస్ కు వ‌ర్షం రేంజ్ ను పెంచింది.

త‌ర్వాత ర‌వితేజ‌తో చంటి సినిమా తీశాడు శోభ‌న్ .. ఈ సినిమా కూడా అంత ఆక‌ట్టుకోలేక‌పోయింది. త‌ర్వాత ఒక రాజు ఒక‌రాణి సినిమాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించారు.. ఇక ఆ త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న త‌ర్వాత 2008 లో భూమిక‌కు క‌థ చెబుతూ గుండెపోటు రావ‌డంతో అక్క‌డిక్క‌డ‌క్కే మృతి చెందారు.. దుర‌దృష్టం ఏమిటి అంటే శోభ‌న్ చ‌నిపోయిన నెల రోజుల త‌ర్వాత ల‌క్ష్మీప‌తి కూడా మ‌ర‌ణించాడు.