41 రోజులుగా శ్మశానంలో గ‌డుపుతున్న కుటుంబం అక్క‌డ ఏం తింటున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

184

ఆధునికత, సాంకేతికత ఎంత పెరిగినా.. మూఢనమ్మకాలపై ప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గట్లేదు. దేశంలో నరబలులు అధికమవుతున్నాయి. తాజాగా చనిపోయిన వ్యక్తిని బతికించేందుకు 41 రోజుల పాటు శ్మశానంలోనే ఓ కుటుంబం గడిపింది. శ్మశానాన్ని ఖాళీ చేయమన్నందుకు గ్రామస్థులపై వారు దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని పెట్లూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ తుపాకుల శ్రీనివాస్ 40 రోజుల క్రితం డెంగీతో మృతి చెందాడు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే, శ్రీనివాస్ మరణించడానికి ముందు రైల్వేకోడూరులో ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ వ్యక్తి చేతబడి చేయడంతో శ్రీనివాస్ మరణించాడని కుటుంబీకులు అనుకున్నారు.

Image result for శ్మశానం

మరణించిన శ్రీనివాస్‌ను ఎలాగైనా బతికించుకోవాలని కుటుంబ సభ్యులంతాక్షుద్రపూజలు చేసే ఓ తాంత్రికుడిని సంప్రదించారు. అతను కూడా శ్రీనివాస్‌ను బతికిస్తామని హామీ ఇచ్చాడు. ఇందుకోసం శ్మశానంలో 41 రోజులు పూజలు చేశాడు. ఇందుకోసం రూ.8లక్షలు ఖర్చు చేయాలన్నాడు. శ్రీనివాస్ కుటుంబం కూడా శ్మశానంలోనే 41 రోజుల పాటు మకాం వేసింది. విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కోరితే వారిపైనే తిరగబడ్డారు. కత్తులతో బెదిరించారు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శ్రీనివాస్ కుటుంబీకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఎవ‌రో ఓ స్వామీజీ ఇలా చెప్పాడు అని సుమారు ఐదు ల‌క్ష‌ల రూపాయలు ముట్ట‌చెప్పారు అని తెలిపారు కుటుంబ స‌భ్యులు, అంతేకాదు మ‌రో ప‌దిరోజులు అయితే నా బిడ్డ ఇంటికి తిరిగి వ‌స్తాడు అని ఆకుటుంబం చెబుతోంది అక్క‌డే భోజనం తింటూ త‌మ కుమారుడి కోసం ఎదురుచూస్తున్నారు కుటుంబ స‌భ్యులు, దీంతో పోలీసులు షాక్ అయ్యారు, వారికి ఎలాగో సర్దిచెప్పి పంపి ఆ స్వామీజీ నెంబ‌ర్ ట్రేస్ చేసి అత‌ని గురించి ప్ర‌త్యేక బృందం వెతుకులాట చేస్తోంది.
మ‌రి చూశారుగా మ‌న లోకువ‌ను న‌మ్మ‌కాన్ని ఇలా కొంద‌రు దొంగ స్వామీజీలు బురిడీ బాబాలు క్యాష్ చేసుకుంటున్నారు బీకేర్ ఫుల్.