మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన 17 ఏళ్ల బాలుడు.. ఆ వీడియోలను ఏం చేశాడో తెలిస్తే షాక్..

283

సమాజంలో స్త్రీకి భద్రత లేదనేది జగమెరిగిన సత్యం.ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి.వారిని లైంగికంగా వేధించేవాళ్ళు అడుగడుగునా ఉన్నారు.కొందరు అయితే మహిళలు స్నానం చేసే బాత్ రూమ్ లలో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీసి మహిళల పరువును బజారుకు ఈడుస్తున్నారు.ఇప్పటివరకు మనం ఎన్నో ఇలాంటి వీడియో ఘటనల గురించి విన్నాం.ఇప్పుడు మరొకటి బయటపడింది. అక్కలా భావించాల్సిన పక్కింటి మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు ఒక బాలుడు. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for boys seeing mobiles

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట జంగమ్మెట్‌ రవీంద్రనాయక్‌ కాలనీలోని ఓ ఇంట్లో మహిళ (28) నివసిస్తోంది. ఆమె ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివాసం ఉండే 17 ఏళ్ల బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ఆ బాలుడు తరచూ ఎదురింట్లోకి వచ్చేవాడు. నెల రోజుల కిందట మహిళ స్నానం చేస్తుండగా ఆ బాలుడు తన సెల్‌ఫోన్‌లో రహస్యంగా వీడియో తీశాడు. ఆపై ఆ వీడియోను తన స్నేహితులందరికీ పంపించి రాక్షసానందం పొందాడు.ఈ వీడియో కాస్త పెద్దల వరకూ చేరడంతో విషయం బాధితురాలి దృష్టికి వచ్చింది. విషయం తెలుసుకున్న మహిళ మార్చి 16న ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 రోజులైనా బాలుడిపై చర్యలు తీసుకోవడం లేదని మనస్తాపంతో బాధితురాలు సోమవారం ఛత్రినాక పోలీసు స్టేషన్‌ ఎదుట బలవన్మరణానికి ప్రయత్నించింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఘటనపై స్పందించిన పోలీసులు.. సదరు బాలుడు తన సెల్‌ఫోన్లో వీడియో దృశ్యాలను డిలీట్‌ చేయడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులను సంప్రదించామని నివేదిక అందాల్సి ఉందని చెప్పారు. అంతేకాకుండా బాలుడు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాస్తుండడంతో చర్యలు తీసుకోలేదని మహిళకు నచ్చజెప్పారు. బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడైన బాలుడిని అరెస్ట్‌ చేశారు. మహిళ స్నానం చేయడాన్ని కిటికీల ద్వారా వీడియో తీశాడని, రెండేళ్లుగా స్నానం చేస్తుండటాన్ని కిటికీల ద్వారా తొంగిచూశానని తెలిపాడు.ఆ విషయాన్నీ విన్న పోలీసులు తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఆ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. చూశారుగా ఈ బాలుడు ఎంతటి పని చేశాడో. మరి ఈ బాలుడు చేసిన ఈ నిర్వాకం గురించి అలాగే ఇలా ఈ మధ్య ఎక్కువగా బయటపడుతున్న బాత్ రూమ్ వీడియో ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.