అత్తాపూర్ హత్య వెనుక బయటపడ్డ షాకింగ్ నిజాలు

363

హైదరాబాద్ నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర రమేష్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేశాడు.రమేశ్ పై కత్తితో దాడి చేస్తున్న ఓ దుండగుడిని యువకుడు వెనుక నుంచి బలంగా తన్నడంతో అతను ముందుకు పడిపోయాడు. అనంతరం పోలీసులు, యువకుడిపై కత్తి రువ్వుతూ బాధితుడిపై మరోసారి దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం.అయితే ఈ హత్య జరగడానికి ముఖ్య కారణం ఏమిటో మీకు తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Image result for attapur murder

పట్టపగలు నడిరోడ్డు మీద ఒకడు కత్తితో మరొకడ్ని చంపేశాడు.రమేష్ అనే వ్యక్తిని అతికిరాతకంగా చంపేశాడు ఒక వ్యక్తి.అయితే ఈ హత్య జరగడానికి పాత కక్షలే హత్యకు కారణం అని తెలుస్తుంది.రమేష్ చనిపోతున్న సమయంలో తనను రక్షించాలంటూ ఆర్తనాదాలు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడున్న వారు రక్షించేందుకు ప్రయత్నించినా అవతలి వ్యక్తి చేతిలో గొడ్డలి ఉండడంతో భయపడుతూ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాడి చేసినవారిలో ఇద్దరిని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.అసలు మహేష్ గౌడ్ ను రమేష్ ఎందుకు చంపాడంటే.. చనిపోయిన మహేష్ గౌడ్ జుమ్మెరా బాద్ లో కిరణం షాప్ నడుపుకుంటూ ఉండేవాడు.అక్కడే ఉంటున్న రమేష్ కు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

Image result for attapur murder

అయితే ఈ విషయం పసిగట్టిన మహేష్ ఆ మహిళను వేదించసాగాడంట.ఈ విషయాన్నీ ఆ మహిళా రమేష్ దృష్టికి తీసుకెళ్లింది.ఆ మహిళను వేధించడం ఆపేయాలని మహేష్ కు రమేష్ చాలాసార్లు చెప్పాడు.అయినా ఎలాంటి లాభం లేకుండా పోయింది.అయితే ఏడాది క్రితం పార్టీ చేసుకుందాం రమ్మని చెప్పి మహేష్ ను రమేష్ శంషాబాద్ వరకు కారులో తీసుకెళ్లాడు.ఇక తర్వాత స్నేహితులను వెంట రమ్మని చెప్పి అతనిని చంపడానికి ప్లాన్ వేశాడు.శంషాబాద్ వెళ్లిన తర్వాత రమేష్ తన ప్లాన్ ను అమలు చేశాడు.అక్కడే స్నేహితుల సాయంతో అతికిరాతకంగా గొంతు కోసి చంపేశాడు.ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఎవరు గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి దహనం చేశాడు.ఈ ఘటన మీద విచారణ జరిపిన పోలీసులు రమేష్ ను నిందితుడిగా చేర్చారు.

ఆ కేసు ఏడాదిగా నడుస్తూనే ఉంది.అప్పటినుంచి కోర్ట్ కు వెళ్ళివస్తూనే ఉన్నాడు.ఈరోజు కూడా ఆ కేసు విషయం మీదనే కోర్ట్ కు వెళ్లి తిరిగివస్తున్నాడు రమేష్.ఇదే సరైన సమయం అనుకుని అతనికి ఎలాగో శిక్ష పడడం లేదని వెంటపడి నరికి చంపారు మహేష్ కుటుంబ సభ్యుడు.ఇంతకు రమేష్ ను చంపింది ఎవరో తెలుసా..మహేష్ గౌడ్ తండ్రి.రమేష్ ను చంపింది నేనే అంటూ గాల్లోకి చేతులు ఊపుతూ మీసాలు తిప్పుతూ సంబరాలు చేసుకున్నాడు మహేష్ తండ్రి.ఏది ఏమైనా తండ్రి పగ ఇలా తీర్చుకున్నాడు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.అత్తాపూర్ హత్య ఘటన మీద అలాగే ఆ హత్య వెనుక ఉన్న రీజన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.