కశ్మీర్‌ లోయలో ఏకైక మహిళా ఐపీఎస్.. మన తెలుగమ్మాయికి కీలక బాధ్యతలు

81

జమ్మూ కశ్మీర్‌ను మోదీ సర్కారు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని రకాలు ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. దీని గురించి పాక్, కాశ్మీర్ లోని కొందరు నేతలు రచ్చ చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. మొన్నటివరకు కాశ్మీర్ అంతా 144 సెక్షన్ ఉండే, కానీ నిన్నటి నుంచి కొన్నిచోట్ల 144 సెక్షన్ ను కు ఎత్తేశారు. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే కొందరు ఏమైనా చర్యలకు పాల్పడవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రభుత్వం అన్ని రకాలగానూ సన్నద్ధమైంది. అమర్‌నాథ్ యాత్రికులను, పర్యాటకులను హుటాహుటిన వెనక్కి పంపిన కేంద్రం.. భారీగా బలగాలను మోహరించింది. తద్వారా ఎలాంటి అవాంఛనీయ చర్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త వహించింది. పలువురు సమర్థమైన అధికారులను జమ్మూ కశ్మీర్‌కు బదిలీ చేసింది. సున్నితమైన కశ్మీర్ లోయలో ఇద్దరు మహిళా ఆఫీసర్లకు కీలక బాధ్యతలు అప్పగించింది. అందులో ఒకరు తెలుగు ఆఫీసర్ కావడం విశేషం.

ఈ క్రింద వీడియో చూడండి

2016 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ పీడీ నిత్య‌కు శ్రీనగర్లో పోస్టింగ్ ఇచ్చారు. ఆమె తెలుగు వారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో పెరిగిన ఆమె బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. కశ్మీరీ, హిందీ భాషలను సైతం అనర్గళంగా మాట్లాడగలరు. రామ్ మున్షి బాగ్, హర్వాన్ దాగ్చి ఏరియాల బాధ్యతలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. దాల్ సరస్సు పరిసరాల్లోని 40 కి.మీ. మేర ప్రాంతం సున్నితమైంది. ఆ ఏరియా పరిధిలో ఉండే గవర్నర్ నివాసం, ప్రముఖులను అదుపులో తీసుకొని ఉంచిన భవనాల బాధ్యతలను కూడా నిత్య పర్యవేక్షిస్తున్నారు.

Image result for ఐపీఎస్ ఆఫీసర్ పీడీ నిత్య‌కు

జమ్మూ కశ్మీర్‌ను యూటీగా ప్రకటించడానికి నాలుగు రోజుల ముందు డాక్టర్ సయ్యద్ సెహ్రిష్ అస్గర్ అనే 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్‌ను ఆ రాష్ట్రానికి బదిలీ చేశారు. ఆమెకు ఊహించని రీతిలో డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌‌గా శ్రీనగర్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం ఆమె బాధ్యత. కానీ కశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు ఆమె అండగా నిలుస్తున్నారు. కశ్మీరీలు దూర ప్రాంతాల్లో ఉంటున్న తమ బంధువులు, సన్నిహితులకు ఫోన్లు చేయడం కోసం, డాక్టర్ల సాయం పొందడానికి అస్గర్ సహకరిస్తున్నారు. మానవత్వంతో విధులు నిర్వర్తిస్తూ అక్కడి ప్రజల్లో భరోసా నింపుతున్నారు. ప్రస్తుతం కశ్మీర్లో బాధ్యతలు నిర్వర్తిస్తోన్న మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అస్గర్, నిత్య మాత్రమే కావడం విశేషం. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉన్నతాధికారులుగా మహిళలను నియమించినప్పటికీ వారంతా జమ్మూ, లడక్ ప్రాంతాల్లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్ చేసిన అస్గర్ జమ్మూలో ప్రాక్టీస్ చేసేవారు. అనంతరం సివిల్స్ రాసి ఐఏఎస్ అయ్యారు.