పింఛను కోసం తల్లి శవంతో ఈ వ్యక్తి ఏడాదిపాటు ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరుగుతుంది..

311

సమాజంలో కొందరు వ్యక్తులు చేసే నీచపు పనులు చూస్తుంటే అసలు మనిషన్న వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అనిపిస్తుంది.సభ్యసమాజం తలదించుకునే నీచపు కార్యాలకు పాల్పడుతున్నాడు ఒక్కొక్కడు.తల్లి చెల్లి తండ్రి భార్య పిల్లలు అనేవి ఏవి పట్టించుకోకుండా కేవలం డబ్బు కోసం మాత్రమే పరితపిస్తున్నారు.డబ్బు ఉంటె చాలు ఇక ఏమి అవసరం లేదనుకుంటున్నారు.డబ్బు కోసం దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు.ఇప్పుడు ఒక కొడుకు తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛను కోసం విపరీత చర్యకు పాల్పడ్డాడు. కన్నతల్లి చనిపోయి ఏడాదైనా ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని పింఛను తీసుకుంటున్నాడు. మరి ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి గురించి పూర్తీగా తెలుసుకుందామా.

స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లోని కారబాంచెల్‌ ప్రాంతంలో గల ఓ అపార్ట్‌మెంట్‌లోని ఇంటి నుంచి గత కొన్ని వారాలుగా విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని దుర్వాసన వెలువడుతున్న ఇంటి తలుపు కొట్టారు. లోపలి నుంచి ఎవరూ తలుపు తీయలేదు. దీంతో బలవంతంగా డోర్ బద్దలుకొట్టి లోనికి వెళ్లిన పోలీసులు అక్కడి దృశ్యాలను చూసి షాక్‌ అయ్యారు. ఆ ఇంట్లో చెక్కతో తయారుచేసిన ఓ శవపేటికలో వృద్ధురాలి కుళ్లిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

గత ఏడాది కాలంగా ఈ ఇంట్లో ఉండే వ్యక్తి తల్లి బయట కన్పించట్లేదని ఇరుగుపొరుగువారు పోలీసులకు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 92ఏళ్ల ఆ మహిళ ఏడాది కిందటే చనిపోయినట్లు తెలుస్తోంది. తల్లి చనిపోయిందని తెలిసినా ఆమె 62ఏళ్ల కుమారుడు పింఛను కోసం ఆమె అంత్యక్రియలు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆమె బతికే ఉందని చెప్పి ఇన్నాళ్లూ పింఛను తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు కుమారుడిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు.