ఈ తెలుగోడిది..ఆ చైనీస్ రెస్టారెంట్ పేరు జూమ్ చేసి చూస్తే నవ్వాపుకోలేరు

993

బిజినెస్ చెయ్యాలంటే ఒక పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం.ఎన్నో విశేషాలు ఉంటేగానీ మన దగ్గరకు రారు కష్టమర్స్.వారిని ఆకట్టుకునేలా ఏదో ఒక వెరైటీ ఉండాలి.అప్పుడు గానీ కష్టమర్స్ మన దగ్గరకు రారు.ఇలా ఆలోచించాడు కాబట్టే తన హోటల్ బిజినెస్ ఎలాగోలా డెవలప్ అయ్యి అందరికి తెలిసేలా చెయ్యాలనుకున్నాడు.అందుకే తన హోటల్ కు ఒక విచిత్రమైన పేరు పెట్టాడు.ఆ పేరే ఇప్పుడు ఆ హోటల్ అందరికి తెలిసేలా చేసింది.ఇంకా చెప్పాలంటే ఆ హోటల్ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.మరి అంతలా అట్రాక్ట్ చేసిన ఆ హోటల్ పేరు ఏమిటో దాని విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.

మనం ఇప్పటివరకు చిత్రాది చిత్రమైన పేర్లను విని ఉంటాం.ఒకోసారి కొన్ని పేర్లు చూస్తే మనం నవ్వాపుకోలేము. ముఖ్యంగా ఫారిన్ లో ఉండే వ్యక్తుల పేర్లు అయితే విని నవ్వలేక చస్తాం.అయితే ఫారెన్ లో మనుషుల పేర్లే కాదు కొన్ని రకాల రెస్టారెంట్ పేర్లు,షాప్స్ పేరు కూడా గమ్మతుగానే ఉంటాయి.

మనమే కాదు సెలేబ్రిటిట్స్ ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటారంటే అతిశయోక్తి ఏం లేదు. దానికి ఉదాహరణ ఇటీవలే మంచు ట్వీట్ చేసిన ఓ ఫోటో. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యక్తి చైనీస్ రెస్టారెంట్ ఒకదాన్ని ఓపెన్ చేశారు.దానికి పేరు పెట్టాలి. తెలుగులోనే పెట్టాలి అనుకున్నాడు కానీ అది చైనీస్ రెస్టారెంట్.ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతని బుర్రలో ఒక ఆలోచన వచ్చింది.చైనీస్ తెలుగు రెండు వచ్చేలా పేరు పెట్టాలి అనుకున్నాడు.

అందుకే చైనీస్, తెలుగును కలిపికొట్టి చాలా ఫన్నీగా చూడగానే ఆకట్టుకునే పేరును పెట్టారు. ఇంతకీ ఆ పేరు ఏంటంటారా? ‘మింగిచావ్’.అవును మీరిన్నది నిజమే. ఆ చైనీస్ రెస్టారెంట్ పేరు మింగిచావ్. మింగి అనేది తెలుగు పదం.చావు అనేది చైనీస్ పదం.ఇది చూసిన మంచు మనోజ్‌ వెంటనే ఆ తెలుగు గై క్రియేటివిటీని మెచ్చుకుంటూ ట్వీటేశాడు. ‘‘ఏం క్రియేటివిటీ ఈ తెలుగు వ్యక్తిది?? జూమ్ చేసి చూడండి అతని చైనీస్ రెస్టారెంట్‌కి ఏం పేరు పెట్టాడో!’’ అని నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ పెట్టాడు మనోజ్.ఈ ట్వీట్ ఇప్పుడు అందరిని నవ్వుకునేలా చేస్తుంది.మీకు కూడా నవ్వొచ్చింది కదూ.