చనిపోయిందనుకుని పూడ్చేశారు.. కానీ వారం తర్వాత చూస్తే

283

ఎవరైనా సరే చనిపోయారని తెలిస్తేనే వాళ్ళను సమాధి చేస్తాం. ఒకటిని నాలుగుసార్లు చూసుకుని వారు నిజంగానే చనిపోయారని ఫిక్స్ అయ్యి మిగతా కార్యక్రమాలు చూస్తాం. కానీ వైద్యులు చేసిన పొరబాటు వలన ఒక మహిళను సమాధిలో పూడ్చేశారు.అయితే సమాధిలో ఉన్న ఆమె చనిపోలేదని బతికేవుందని తరువాత తెలిసింది. ఏమైందో అసలేం అర్థం అవ్వడం లేదు కదా. పూర్తీగా చెబుతా వినండి.

Image result for dead body

బ్రెజిల్ కు చెందిన 37 ఏళ్ల శాంటాస్ అనే మహిళ ఆయాసంతో కొన్ని రోజుల క్రితం ఒక హాస్పిటల్ లో చేరింది. అయితే ఆయాసంతో ఆమె కళ్ళు తిరిగిపడిపోయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె హార్ట్ అటాక్ తో చనిపోయిందని చెప్పేశారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అయ్యింది. ఇక చేసేదేమి లేక ఆమెను స్మశానంలో సమాధి చేశారు. ఒక శవపేటికలో ఆమెను ఉంచి సమాధి చేశారు. దాని మీద సిమెంట్ తో సమాధి కట్టేశారు. అయితే ఆమె అప్పటికే చనిపోలేదు. జనవరి 28 న చనిపోయిందనుకుని అదే రోజు సాయంత్రం ఆమెను సమాధి చేశారు. మెలుకువ వచ్చి చూస్తే ఆమె సమాధిలో ఉంది. సమాధి లోపల సరిగ్గా నరకం అనుభవించింది. బయటకు తీయండి అని మొత్తుకుంది. సమాధిని బద్దలుకొట్టాలనుకుంది. కానీ ఆమె వల్ల కాలేదు. కానీ ఆ సమాధి శబ్దాలు మాత్రం బయటకు వినిపించేవి. అక్కడ ఆడుకోడానికి కొంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ శబ్దాలను విన్నారు. వాళ్ళు విన్న శబ్దాల గురించి అందరికి చెబితే ఎవరు వీటిని నమ్మలేదు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే ఫిబ్రవరి 9 వ తేదీన ఒక మహిళ అటుగా వెళ్తుంటే సమాధి నుంచి శబ్దాలు వచ్చాయి. వాటిని విన్న ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే స్పందించిన బంధువులు సమాధిని పగలగొట్టి బయటకు తీశారు. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆమె అప్పటికే చనిపోయింది. పాపం ఆమె శవపేటికను తెరవాలని తెగప్రయత్నించింది. చేతుల మీద నుదుటి మీద పలు గాయాలు ఉన్నాయి. బయటకు రావాలని ఆమె చాలా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అలాగే శవపేటిక మీద కొట్టిన కొన్ని మేకులు కూడా బయటకు వచ్చాయి. కానీ ఆమె పూర్తీగా బయటకు రాలేకపోయింది. ఆమెను బయటకు తీసే సమయానికి ఆమె చనిపోయింది.ఆమె శరీరం ఇంకా వేడిగానే ఉంది. కానీ ఆమె చనిపోయిందని స్పష్టం చేశారు వైద్యులు.కొన్ని గంటల ముందు సమాధిని తవ్వి ఉంటె ఆమె బతికుండేదంట. చూశారుగా డాక్టర్స్ తప్పు వలన ఒక మహిళ ఎలా చనిపోవాల్సి వచ్చిందో. మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా వైద్యుల నిర్లక్ష్యం వలన ఇలా చనిపోయే ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.