Breaking News:అయ్యో నందమూరి ఇంట మరో ఘోరం..ఇది నాల్గవసారి షాక్ లో ఫ్యామిలీ

508

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. ప్రతిపక్షాలు వేసిన స్పీడ్ బ్రేకర్లను దాటుకొని బంపర్ విక్టరీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభంజనం దెబ్బకు విపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబరాన్ని తాకాయి. సంబరాలు ఇక్కడ మాత్రమే కాదు పొరుగు రాష్ట్రమైన ఏపీలో కూడా జరిగాయి. విజయవాడలో టీఆర్ఎస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఈ విషయాలన్నీ పక్కన పెడితే తెలంగాణ ఫలితాలు కాంగ్రెస్ నేతలనే కాదు టీడీపీ పార్టీని ముఖ్యంగా నందమూరి కుటుంబాన్ని షాక్ కు గురి చేసింది.ముఖ్యంగా భారీ ఆశలు పెట్టుకున్న కూకట్ పల్లిలో సుహాసిని ఓడిపోవడం వారిని షాక్ కు గురి చేసింది.అయితే దీని గురించి చర్చించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు కుటుంబానికి నాలుగో ఓటమి ఎదురైంది. ఆయన మనుమరాలు సుహాసిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు మూడుసార్లు ఆ కుటుంబానికి ఓటమి ఎదురైంది. ఎన్టీ రామారావు స్వయంగా ఒకసారి ఓడిపోయారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేశారు. అందులో అనంతపురం జిల్లా హిందూపురంలో గెలిచి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ కూడా ఓడిపోయింది. ఆ తర్వాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు జయకృష్ణ శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పటికి ఎన్టీఆర్‌ చనిపోయారు. ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి అధ్యక్షురాలిగా ఉన్న ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. తర్వాత మళ్లీ జయకృష్ణ ఎన్నికల రాజకీయాల్లోకి రాలేదు.

1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ కుమారుడు హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ నుంచి పోటీచేశారు. టీడీపీతో విభేదించి ఆయన అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తర్వాత ఆయన ఆ పార్టీని రద్దు చేసి మళ్ళీ టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేసి ఓడిపోయారు.ఇలా నందమూరి రాజకీయ జీవితంలో ఆ కుటుంబ సభ్యులు ఓడిపోవడం ఇది నాలుగోసారి.కూకట్ పల్లిలో ఎక్కువగా ఆంధ్రా సెటిలర్స్ ఉంటారు.అందుకే ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకున్నారు.కానీ ఎక్కడో ఉన్న సుహాసినిని ఎందుకు గెలిపిస్తారు చెప్పండి.ఇక్కడే ఉండి వారి సమస్యలను తీర్చే వారిని ఎన్నుకుంటారు గానీ.అందుకే మాధవరం కృష్ణారావు ఘనవిజయం సాధించారు.