టీమీండియా మాజీ కెప్టెన్ క‌న్నుమూత శోక‌సంద్రంటో క్రికెట‌ర్లు

480

భార‌త్ లో అంద‌రికి క్రికెట్ అంటే అమిత‌మైన ఇష్టం… అందుకే జాతీయ క్రిడ హాకీ అయినా క్రికెట్ అభిమానులే మ‌న దేశంలో ఎక్కువ‌గా ఉంటారు.భార‌త క్రికెట‌ర్ల‌పై అందుకే ఎంతో ఇష్టం పెంచుకుంటారు.. త‌మ దేశం ప‌రువును ఇత‌ర దేశాల‌తో పోటిప‌డి గెలిపిస్తార‌ని అభిమానిస్తారు… ఇక ఇలాంటి ఎన్నో ప్ర‌శంస‌లు అవార్డులు మ‌న దేశానికి సాధించిపెట్టిన క్రికెట‌ర్లు ఎవ‌రైనా మ‌న నుంచి దూరం అయితే ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం.. తాజాగా అదే జ‌రిగింది…..భారత్‌ మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ వాడేకర్ క‌న్నుమూశారు…ఆయ‌న వ‌య‌సు 77 సంవ‌త్స‌రాలు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఏప్రిల్‌ 1, 1941లో జన్మించిన అజిత్‌ లక్ష్మణ్‌ వాడేకర్‌, 1966-74 మధ్య భారత జట్టుకు ఆడారు. దూకుడైన బ్యాట్స్‌మన్‌గా ఆయ‌న‌కు భార‌త ఆట‌గాళ్ల త‌ర‌పున పేరు ఉంది.. ఆయన నేతృత్వంలోనే 1971లో భారత జట్టు వెస్టిండీస్‌ (ఐదు టెస్ట్‌ల సిరీస్‌ తో), ఇంగ్లండ్‌ (మూడు టెస్ట్‌ల సిరీస్ ల‌లో చారిత్రక విజయాలు సాధించింది. రెండు జట్లపైనా భారత్‌కు అవి తొలి సిరీస్‌ విజయాలు కావడం ఇక్క‌డ గొప్ప విష‌యం.. 1958-59లో ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ ప్రారంభించిన వాడేకర్‌.. దేశవాళీల్లో అమోఘంగా రాణించినా, ఆయ‌న భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎనిమిది సంవత్సరాలపాటు ఎదురు చూడాల్సివచ్చింది.

సొంతగ్రౌండ్‌ బొంబాయిలో 1966లో వెస్టిండీ్‌సతో జరిగిన మ్యాచ్‌తో ఆయన టెస్ట్‌ అరంగేట్రం చేశారు. భారత క్రికెట్‌లో అత్యుత్తమ మూడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆయ‌న‌కు పేరు ఉంది….స్లిప్పులో అద్భుతమైన ఫీల్డర్‌గా మన్ననలు పొందారు. సుదీర్ఘకాలం భారత సారథిగా వ్యవహరించిన ఎంఏకే పటౌడీ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వాడేకర్‌..వ్యూహ రచనలో మేటి…. దిగ్గజ ఆటగాళ్లు సునీల్‌ గవాస్కర్‌, గుండప్ప విశ్వనాథ్‌, ఫారుఖ్‌ ఇంజనీర్‌, స్పిన్‌ చతుష్టయం బిషన్‌సింగ్‌ బేడీ, ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్‌ చంద్రశేఖర్‌, శ్రీనివాస వెంకటరాఘవన్‌లతో కూడిన భారత జట్టుకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. 1970వ దశకంలో దిగ్గజ జట్లు వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌లను వాటి గడ్డపై వాడేకర్‌ నాయకత్వంలో మట్టికరిపించి టెస్ట్‌ సిరీ్‌సలను భారత్‌ చేజిక్కించుకోవడంతో ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది… అయితే ఆపై ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్‌ చవిచూసిన పరాజయాలకు వాడేకర్‌ను బలి పశువును చేయడంతో 1974లో ఆయన రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది.

సీకే నాయుడు జీవిత సాఫల్యపురస్కారం

ఆ తర్వాత దశాబ్దానికి భారత క్రికెట్‌తో అజిత్‌ అనుబంధం మళ్లీ ప్రారంభమైంది. అప్పట్లో పలు విజయాలు సాధించిన భారత జట్లకు ఆయన మేనేజర్‌గా వ్యవహరించారు. అజరుద్దీన్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా మేనేజర్‌గా ఉండడంతో అతడితో అజిత్‌కు ఎక్కువ అనుబంధం ఉండేది. కెప్టెన్‌గా, కోచ్‌/మేనేజర్‌గా, చీఫ్‌ సెలెక్టర్‌గా భారత్‌కు సేవలందించిన కొద్దిమంది క్రికెటర్లలో వాడేకర్‌ ఒకరు. భారత్‌కు వన్డేల్లో తొలి కెప్టెన్‌ అయిన అజిత్‌ను ప్రభుత్వం అర్జున , పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. వాడేకర్‌ మృతితో క్రీడాలోకం దిగ్ర్భాంతి చెందింది. రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బీసీసీఐతోపాటు మాజీలు బిషన్‌ సింగ్‌ బేదీ, సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, సచిన్‌, అజరుద్దీన్‌, కోచ్‌ రవిశాస్త్రి, హర్షాభోగ్లే, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా తదితరులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.