ప్రపంచం లోనే అత్యంత ఎక్కువగా జీతాలు తీసుకొనే టీచర్స్ వీళ్ళే

514

అక్కడ ఎటు చూసినా ఆహ్లాదం గొలిపే సుందరమైన ప్రకృతి దృశ్యాలు, ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పార్కులు, ఉద్యానవనాలు, సముద్రాలు, బీచ్‌లు… ఓహ్..! ఒక్కటేమిటి… అదొక భూతల స్వర్గం. అక్కడికి ఏటా ఎన్నో కోట్ల మంది టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాల్లో అది అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవన్నీ చెప్పగానే మీకు ఏం గుర్తుకు వస్తోంది. అదేనండీ అమెరికాలోని హవాయి రాష్ట్రం. ఏ వైపు చూసినా ఆకట్టుకునే ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ప్రదేశం. పర్యాటకాన్ని అమితంగా ఇష్టపడే వారు జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి కొంత సేపు విశ్రాంతిగా గడిపి రావాలని కలలు కంటుంటారు.అయితే అక్కడ ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది? ఇంకేముంటుంది, లైఫ్ అంతా బిందాస్. అలాంటి ప్రదేశంలో ఉద్యోగం రావాలి గానీ ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. అయితే ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.

ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దాని గురించే. అదేమిటంటే ఇప్పుడక్కడ టీచర్లకు విపరీతమైన డిమాండ్ ఉందట. అందుకోసం అక్కడి పాఠశాలలు మంచి స్కిల్ ఉన్న టీచర్లకు దాదాపు 50వేల అమెరికన్ డాలర్లను (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.33 లక్షలు) సైతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయట.గత కొన్ని సంవత్సరాలుగా హవాయి రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి గణనీయమైన రీతిలో జరుగుతుండడంతో అక్కడ ఇప్పుడు విద్యారంగంలో పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయట.ఈ క్రమంలో స్థానిక పాఠశాలల్లో దాదాపు 1600 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఈ పోస్టులకు గాను వారు 35 వేల డాలర్ల నుంచి 63 వేల డాలర్ల వరకు వార్షిక వేతనాన్ని ఉపాధ్యాయులకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారట. అయినా అక్కడ చదువు చెప్పేందుకు చాలా తక్కువ మంది లభిస్తున్నారట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే హవాయి పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు ఇతర దేశాల వారిని కూడా ఇప్పుడు ఆహ్వానిస్తున్నాయట. ఒక వేళ ఎవరైనా ఆ పోస్టుల్లో చేరి మంచి ప్రదర్శన చూపిస్తే వారికి 3 వేల డాలర్ల వార్షిక బోనస్ కూడా లభిస్తుందట.ఓ బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అర్హత, గణితం, సైన్స్ వంటి అంశాల్లో పట్టు ఉన్న ఉపాధ్యాయులకు తమ వద్ద చక్కని అవకాశాలు ఉన్నాయని హవాయి అధికారులు చెబుతున్నారు.ఇంకేముంది! మీకు ఆ అర్హతలు ఉంటే, వెంటనే అమెరికా చెక్కేయండి! లేదంటే ఇతరులెవరైనా తెలిసిన వారుంటే వారికైనా చెప్పండి. కాకపోతే ఒక్క విషయం. హవాయి రాష్ట్రం ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రదేశంగా పేరుగాంచింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ రేంజ్ జీతంతో ఉద్యోగం చేసినా ఖర్చులు కూడా అదే లెవల్‌లో ఉంటాయి. కాబట్టి వెళ్లేముందు ఒకసారి పునరాలోచించుకోండి.