కామంతో తట్టుకోలేక ఈ టీచర్ గుట్టుచప్పుడు కాకుండా ఎంత పని చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

544

గురువు అంటే మనకు ఎంతో గౌరవం.ఎందుకంటే అమ్మానాన్న తర్వాత మనకు జీవితం అంటే ఏమిటో నేర్పించేది వాళ్ళే.అమ్మానాన్న జన్మను మాత్రమే ఇస్తారు కానీ గురువు జీవితంలో ఎలా బతకాలో నేర్పిస్తారు.అలాంటి గురువులను చూస్తే ఎవరికైనా చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది.అయితే కొంతమంది గురువులు మాత్రం గురువు అనే పదానికి చెడ్డపేరు తెస్తున్నారు.ఇప్పుడు మీకొక ఉపాధ్యాయుడి రాసలీల గురించి చెప్పబోతున్నాను.మరి అతనెవరు అతను చేసిన ఘనకార్యం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for student and teacher

నాగార్జున సాగర్‌లో విజయపురి సౌత్‌కు చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన యువకుడిని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యావాలంటీర్ గా పని చేస్తుంది. కాపురం సజావుగా సాగిపోతున్న తరుణంలో 2015లో క్యాంప్‌ 2 పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యర్రంశెట్టి వెంకట శివప్రసాద్‌ ఆమెపై కన్నేశాడు. టీటీసీ చదివిన ఆ యువతిని పాఠశాలలో బిగ్‌ హెల్ప్‌ వలంటీర్‌ పోస్టు ఖాళీగా ఉందని పిలిపించుకున్నాడు. నెలకు రూ. 1500 జీతం, సాయంత్రం ట్యూషన్‌ చెప్తే రూ. 2 వేలు వెరసి నెలకు రూ. 3,500 ఇస్తానని ఆమెను స్కూల్లో చేర్చుకున్నాడు. అప్పటికే ఆ యువతి కుటుంబం ఆర్ధిక సమస్యలతో సతమతమవుతోంది.ఆమెకు తండ్రి లేకపోవడం, నిరుపేద కుటుంబం కావడం, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం గమనించిన శివప్రసాద్‌ ఆమెకు తెలియకుండానే ఆమెకు ఉన్న రూ. 50 వేల అప్పు తీర్చాడు. రెండో నెల నుంచి జీతం రూ. 2 వేలకు పెంచాడు.

Image result for student and teacher

నేను డబ్బులిచ్చాను కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు వినాలి… లేదంటే నీ ఉద్యోగం పోతుంది అంటూ బ్లాక్‌మెయిల్‌ చేసి లోబర్చుకున్నారు.ఆ విధంగా ఆరు నెలల పాటు ఆమెతో గుట్టుగా సహజీవనం సాగించాడు. విషయం భర్తకు తెలియడంతో అతడు స్కూలుకు వచ్చి గొడవ చేశాడు. దీనితో శివప్రసాద్‌ మరో కొత్తనాటకం ప్రారంభించాడు. నీకు వేరే స్కూల్లో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించబోతున్నానని, నీ భర్త అక్కడకు కూడా వచ్చి గొడవ చేస్తే నీ ఉద్యోగం పోతుందని ఆశ కల్పిస్తూనే బెదిరించాడు. ఈ క్రమంలో భర్తకు విడాకులు ఇవ్వాలని సూచించాడు. నీకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటానని నమ్మించాడు. తనకు తెలిసిన న్యాయవాది వద్దకు తీసుకెళ్లి విడాకులకు దరఖాస్తు చేయించాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మరి కొద్ది రోజుల్లో విడాకులు వస్తాయనుకుంటున్న తరుణంలో ప్లేటు ఫిరాయించాడు. నీతో నాకు సంబంధం లేదని అడ్డం తిరిగాడు. కట్టుకున్నోడిని వదులుకోగా నమ్మినోడు నట్టేట ముంచడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ యువతి సోమవారం సీఎం కార్యాలయంలోనూ, రూరల్‌ ఎస్పీకి, జిల్లా కలెక్టర్‌ ద్వారా డీఈవోకు ఫిర్యాదు చేసింది. మరో మూడు నాలుగేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సిన వయసులో ఉన్న ఉపాధ్యాయుడి బాగోతం చర్చనీయాంశంగా మారింది.విన్నారుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ గురువు ఎంతటి దుశ్చర్యకు పాల్పడ్డాడో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.మహిళను నమ్మించి మోసం చేసిన ఈ గురువు గురించి అలాగే సమాజానికి బుద్ధి నేర్పాల్సిన గురువులే ఈ మధ్య ఇలాంటి కార్యాలకు పాల్పడటం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.