ట్యూషన్ కోసం వెళ్తే ఏకంగా 10th క్లాస్ అబ్బాయిని ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

782

మాతృదేవో భవ ,పితృదేవో భవ ఆచార్య దేవోభవ అని అంటారు. అంటే తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుది. గురువును దేవుడితో సమానంగా చూస్తాం.కానీ ఈ మధ్య కొందరు టీచర్స్ చేస్తున్న పనులు చూస్తే సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఈ మధ్య కొందరు టీచర్స్ స్టూడెంట్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడి పెళ్లిళ్ల దాకా వెళ్తున్నారు. ఇప్పుడు ఒకరితో పెళ్ళైన టీచర్ తను చదువు చెపుతున్న పదవ తరగతి కుర్రాడిని తీసుకుని పారిపోయింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for CLASS TEACHER

తమిళనాడులోని సేలం తిరువాగౌండనూరుకు చెందిన 26 ఏళ్ల మహిళ ప్రైవేట్ ట్యుటోరియల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు బాగల్పట్టికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్తో గత నెల 19వ తేదీన వివాహం జరిగింది. వివాహమైన వారం తర్వాత భర్త చెన్నైలో ఉద్యోగం చేసేందుకు వెళ్లాడు.దీంతో ఆ టీచర్ పుట్టింటికి వెళ్లింది. పుట్టింటికి సమీపంలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి వస్తానని చెప్పిన ఆ మహిళ ఇంటికి తిరిగి రాలేదు. నాలుగు రోజులుగా ఎంత వెతికినా కూడ ఆమె ఆచూకీ లభించలేదు. నాలుగు రోజుల తర్వాత పదో తరగతి విద్యార్థితో కలిసి డిసెంబర్ 18వ తేదీన ఆమె తమ ఇంటికి సమీపంలోని పోలీస్ స్టేషన్కు వచ్చింది.

పదో తరగతి విద్యార్థితో కలిసి తాను జీవిస్తానని ఆమె పోలీసులకు తేల్చి చెప్పింది. తనకు భర్త వద్దని, ఆ పిల్లాడితోనే ఉంటానని చెప్పడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు.చివరికి ఆ బాలుడి తల్లిదండ్రులకు పోలీసులు ఈ విషయం చెప్పడంతో వాళ్ళు షాక్కు గురయ్యారు. బాలుడికి కూడ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ బాలుడిని పోలీసులు తల్లిదండ్రుల వెంట పంపారు.మమ్మల్ని దూరం చేసిన మా ప్రేమను దూరం చెయ్యలేరని ఆ టీచర్ వెళ్తూ వెళ్తూ చేసిన వ్యాఖ్యలు విని ఇదెక్కడి లొల్లిరా బాబు అని పోలీసులు అనుకున్నారు. చూడాలి మరి దూరంగా ఉంటారో లేక మళ్ళి ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తారో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. పెళ్ళైన తర్వాత కూడా స్టూడెంట్ తో పారిపోయిన ఈ టీచర్ గురించి అలాగే ఇలా తప్పుడు పనులు చేసి టీచర్ స్టూడెంట్ బంధానికి మచ్చ తెస్తున్న వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.