ఆ టీచర్ క్లాస్ రూమ్ లో అందరి ముందలే లేడి స్టూడెంట్ తో ఎలాంటి పని చేపించుకుందో తెలిస్తే అది అసలు టీచరేనా అంటారు..

2495

మాతృదేవోభవ…పితృదేవోభవ..ఆచార్యదేవోభవ. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. అందుకే మన సమాజంలో గురువుకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నవ సమాజాన్ని ,బావి భారతాన్ని నిర్మించాల్సిన బాధ్యత గురువులపై ఉంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, బంగారు భవిష్యతకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. విధి నిర్వహణలో కొంతమంది టీచర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాఠాలు చెప్పకుండా పిల్లల భవిష్యత్ ను పాడు చేస్తూ ఉపాధ్యాయ వృత్తికే చెడ్డపేరు తెస్తున్నారు కొంతమంది టీచర్లు.ఇప్పుడు ఒక ప్రభుత్వ టీచర్ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.మరి ఆ టీచర్ చేసిన నిర్వాకం గురించి తెలుసుకుందామా.

Image result for teacher massage at class room

జనగామ జిల్లాలోని నర్మెట ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌‌లో ఫిజిక్స్ టీచర్‌ పార్వతి.ఈమె పిల్లలకు పాఠాలు చెప్పకపోవడమే కాకుండా విద్యార్థినులతో జడ వేయించుకోవడం, బాడీ మసాజ్‌ చేయించుకోవడం చేస్తోంది. అది కూడా తరగతి గదిలోనే కావడం చర్చనీయంగా మారింది.అందరు చూస్తుండగానే ఆ టీచర్ పిల్లల చేతిలో పనులు చేపించుకుంటుంది.క్లాస్ రూమ్ లో ఎవరైనా సరే అల్లరి చేస్తే చాలు ఈమెకు సేవలు చెయ్యాల్సిందే.జడలు వెయ్యడం మసాజులు చెయ్యడం లాంటి శిక్షలు వేస్తుంది.సదరు టీచరమ్మ తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థినితో మసాజ్ చేయించుకుంటుండగా.. సహ విద్యార్థి ఒకరు ఆ దృశ్యాలను తన సెల్‌ ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది.మా మోడల్ స్కూల్లో ఎప్పుడూ ఇదే గతి. మాకు పాఠాలు చెప్పరు.. ఏం చెప్పరు. క్లాస్ రూమ్‌లోనే మసాజ్‌లు చేయించుకుంటారు. మాకు మంచి చదువులు చెప్పే టీచర్లు కావాలి అంటూ ఆ విద్యార్థి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

పిల్లలకు మంచి క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించి.. విద్యార్థులను ప్రయోజకులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే ఇలా చేయడంపై పలువురు మండిపడుతున్నారు. స్కూల్‌లో పాఠాలు చెప్పకపోగా.. విద్యార్థులతో సొంత పనులు చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఘటనపై నర్మెట ఇంఛార్జ్ డీఈవో రాజీవ్ విచారించారు. సదరు ఉపాధ్యాయురాలిపై చర్య తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఉపాధ్యాయులురాలి నుంచి వివరణ కోరి ఉన్నతాధికారులు ఆమెపై చర్య తీసుకోనున్నారు.మరి ఈ టీచర్ వ్యవహారం గురించి మీరేమంటారు.ఇలాంటి టీచర్స్ కు ఎలాంటి శిక్ష వేస్తే మిగిలిన టీచర్స్ అయినా పిల్లలతో ఇలా చేపించుకోకుండా ఉంటారు.అలాగే ఇలాంటి టీచర్స్ ను ఎలా శిక్షించాలో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.