విద్యార్థులు లేని సమయంలో క్లాసు టీచర్ రాసలీలలు

340

విద్యార్థులకు చదువు చెప్పి వారిని ఒక దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పారు. సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న ఉపాధ్యాయ వృత్తికి మచ్చగా మారారు. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తున్న మన దేశంలో కొందరి అసభ్య ప్రవర్తన వల్ల తలదించుకోవాల్సి వస్తోంది. ఉపాధ్యాయులే ఇలా ఉంటే పిల్లలు ఎలా తయారవుతారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఆ టీచర్స్ ఏం చేశారని ఆలోచిస్తున్నారా..అయితే పూర్తీగా చెబుతా వినండి.

గుజరాత్ రాష్ట్రం దహోద్ జిల్లాలోని బామన్ గ్రామంలో ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఏకంగా తరగతి గదిలోనే ముద్దుల పురాణానికి తెరలేపారు. ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ తెగ ఎంజాయ్ చేశారు. కానీ వారికి తెలియదు. ఓ మూడో కన్ను వారిని ఓ కంటకనబెడుతోందని. అదే వారిని అడ్డంగా బుక్ చేసింది. ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌లో వీరి బాగోతాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియో వైరల్‌ అవడంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే ఆ ఇద్దరు టీచర్లు ఎవరనేది ఇప్పటి వరకు తెలియరాలేదని జిల్లా ప్రాథమిక విద్యాధికారి ఎన్జీ వ్యాస్ చెప్పారు. వీడియో వైరల్‌గా మారిన తర్వాత చాలా ఇబ్బందిగా మారడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉపాధ్యాయులను క్షమించరాదని వారు ఎవరో తెలుసుకుని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు. ఇలాంటి వారివల్ల పిల్లలు పెడదోవ పడుతున్నారని వారు వాపోయారు.

ఆ టీచర్ చేసిన పనికి నెటిజెన్స్ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. అలాంటి నీచులని ఏం చేయాలి.? ఇలాంటి వారు రేపు పొద్దున్న పిల్లలకి ఏం నేర్పిస్తారు.?అని దుమ్మెత్తిపోస్తున్నారు.గతనెలలో కూడా పూణేలోని ఓ పాఠశాలలో ఓ పీటీ మాస్టరు నలుగురు 9వ తరగతి అబ్బాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే పేరుతో జరుగుతున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా వీరిపై లైంగిక దాడికి పాల్పడటంతో విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. వెంటనే టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.చూశారుగా ఈ టీచర్స్ ఎంత పని చేశారో.తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. అంతటి ప్రాధాన్యతని ఇస్తాం మనం గురువుకి.మరి అలంటి గురువులే ఇలా అసభ్యకరంగా చేస్తే ఎలా చెప్పండి.