మావోయిస్టుల ఘాతుకం మరువక ముందే టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం శోక‌సంద్రంలో చంద్ర‌బాబు

398

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు హ‌రికృష్ణ మృతి ఇంకా ఆ పార్టీ నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.. ఇక ఆయ‌న మ‌ర‌ణంతో పార్టీ నాయ‌కులు ఇప్ప‌టికే ఎంతో బాధ‌లో ఉన్నారు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల‌క నేత‌గా ఎన్టీఆర్ నుంచి పార్టీకి ఆయ‌న వెన్నంటి ఉన్నారు.. అలాంటి నాయ‌కుడి మ‌ర‌ణం ఆపార్టీని ఆ నాయ‌కుల‌ను ఎంతో క‌లిచివేసింది …ఇక మ‌రో టీడీపీ నాయకుడు మ‌ర‌ణం ఇప్పుడు పార్టీ నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఖ‌మ్మంకు చెందిన ఆకార‌పు ముకుందం టీడీపీ నాయ‌కుడు గుండెపోటుతో మృతిచెందారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నారు. ఆయ‌న మృతివార్తను తెలుసుకున్న సీఎం చంద్ర‌బాబు అలాగే, మంత్రి లోకేష్, టీడీపీ తెలంగాణ తెలుగుదేశం నాయ‌కులు శ‌ద్రాంజ‌లి ఘ‌టించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి ముకుందం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి ముకుందం శక్తి వంచన లేకుండా కృషి చేశారని గుర్తు చేశారు… ప్రస్తుత పరిస్థితిలో ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుమారుడు ఆకారపు శ్రీనివాస్‌ను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ముకుందం కుమారుడు శ్రీనివాస్‌ను పోలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్‌లో పరామర్శించారు. తోటకూరి శివయ్య, మందపాటి వెంకటేశ్వర్లు, కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహద్రి యాదవ్‌, గొల్లపూడి హరికృష్ణ, మీగడ రామారావు, చిరుమామిళ్ల నాగేశ్వరరావు శ్రీనివాస్‌ను పరామర్శించారు.

ఇక టీడీపీలో ఆయ‌న ఎంతో కాలంగా కొన‌సాగుతున్నార ..పార్టీ త‌ర‌పున ఆయ‌న ముందు నుంచి క్రియాశీల‌కంగా ఉన్నారు..జిల్లాలో ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్ధానం టీడీపీలో ఉంది.. దీంతో ఆయ‌న మ‌ర‌ణాన్ని పార్టీ నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.. ఆయ‌న కుటుంబం శోక‌సంద్రంలో ఉంది.