ఒళ్లంతా ట్యాటూలే చివ‌ర‌కు అత‌నికి ఎంత‌ దారుణ‌మైన జ‌బ్బు వ‌చ్చిందో తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం.!

545

తెల్ల‌తోలు మంద‌పాటి లేత చాయ ఉంటే చాలు అందంగా శరీరంపై క‌నిపించే విధంగా ట్యాటూలు వేయించుకుంటాం.. ఇప్పుడు ట్యాటులు పెద్ద ఫ్యాష‌న్ అయిన విష‌యం తెలిసిందే… అందుకే ట్యాటూలు వేసుకోవాలి అంటే గ‌తంలో కాస్త ఆలోచించేవారు.. కాని ఇప్పుడు ఈ న‌వీన యుగంలో ఫ్యాషన్ కు అనుగుణంగా వారు కూడా అలాగే ముందుకు వెళుతున్నారు… ఈ ట్యాటుల క‌ల్చర్ 1960 నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నా, మ‌న‌దేశంలో మాత్రం 2000 నుంచి బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది.. ఇప్పుడు ప‌చ్చ‌బొట్లు బ‌దులు ట్యాటులే వేయించుకుంటున్నారు అంద‌రూ.

ఊహించని పనులు చేసే వ్యక్తులను అరుదైన వారిగా ఈ ప్రపంచం గుర్తిస్తుంది. ట్యాటూల కోసం ఓ రష్యన్‌ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ విషయం ఇప్పుడు ఏమిటి అనేది తెలుసుకుందాం…. నేటి ఆధునిక కాలంలో ఒంటిపై పచ్చబొట్టు వేయించుకోవడం ఫ్యాషన్, ఇదినిజం కాదు అనే వారు లేదు.. వాటితోనే ఒళ్లంతా నింపేసుకునే ఘటనలు చాలా అరుదు. ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలు ఇప్పుడు ఈ ట్యాటులతో ఒళ్లంతా నింపేస్తున్నారు.

ఇక తాజాగా ఈ ట్యాటూల కోసం తన సున్నిత అవయవాలు సైతం పణంగా పెట్టాడు ఓ వ్య‌క్తి…. చివ‌ర‌కు ఇలాంటి ప‌ని ఎందుకు చేశాడు అని ఆశ్చ‌ర్య‌పోతారు..రష్యాకు చెందిన 32 ఏళ్ల ఆడం కర్లీకేల్‌ ట్యాటూల కోసం ఏకంగా తన గుప్త భాగాలనే తీసేయించుకున్నాడు. ఒళ్లంతా ట్యాటూలతో నింపేసుకుని సరికొత్త వర్ణంలోకి మారిపోయాడు.

ఎందుకంటే తనకి చర్మ క్యాన్సర్‌. ఎంతకాలం జీవిస్తాడో తెలియని తనకి క్యాన్సర్‌తో పాటు ఆల్బునిజం (శరీరం రంగు మారే వ్యాధి) సోకడంతో ఒళ్లంతా అందవిహీనంగా మారిపోయిందట. అందుకే బతికే కొన్నాళ్లయినా తన జబ్బు ప్రతిక్షణం గుర్తుకు రావొద్దని శరీరం మొత్తం ట్యాటూలకు అప్పగించేశాడు….100 శాతం ట్యాటూలతో రికార్డు సృ‍ష్టించాడు. తనకు బూడిద రంగు అంటే ఇష్టమనీ, అందుకే జబ్బు పడినప్పుడు ఒళ్లంతా ఇలా నింపేశానని ఆడం చెప్పుకొచ్చాడు. ఇక్క‌డ కొస‌మెరుపు ఏమిటంటే… దేవుడి దయ వల్ల ఆడం క్యాన్సర్‌ను జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఇప్పుడు క్యాన్స‌ర్ త‌గ్గినా ఆ డిఫ‌రెంట్ క‌ల‌ర్ తో అత‌ని లుక్ మొత్తం మారిపోయింది.. త‌న‌కు ప్రాణాపాయం ఉంది కాబ‌ట్టి అందుకే ఇలా ట్యాటులు గ‌తంలో వేయించుకున్నా, ఇప్పుడు తాను బ్ర‌తికినా, గ‌తంలో త‌నకు వ‌చ్చిన జ‌బ్బు ఈ ట్యాటులు గుర్తు చేస్తాయ‌ని చెబుతున్నాడు ఈ వ్య‌క్తి.. చూశారుగా ట్యాటుల‌తో త‌న జీవితం కోల్పోయాను అని అనుకోకుండా బ్ర‌తికినంత కాలం త‌న‌కు ఇష్ట‌మైన ట్యాటూల‌ను చూసి బ్ర‌త‌కాలి అని భావించాడు ఈ వ్య‌క్తి. ఇత‌ని విష‌యంలో మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియచేయండి…