Breaking News : సోషల్ మీడియా సెల్ఫీ క్వీన్ సెల్ఫీ తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయింది

246

ప్రపంచంలో నడుస్తోంది సెల్ఫీ ట్రెండ్. అందరికీ ఇష్టమైన ప్రాంతానికి వెళ్లిన వాళ్లు తమ సంతోషాన్ని సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అంతేకాదు సెలబ్రిటీలు కనబడిన, ఒక కొత్త ప్రాంతానికి వెళ్లినా, ఒక వింతగా కనిపించినా ఇక సెల్ఫీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు జనాలు.ఆ తీసిన ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో పెడతారు.బాగా లైక్స్ రావాలని ఇలా చేస్తారు.అయితే ఇలా సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు కోల్పోతున్నవారు చాలా మంది ఉన్నారు. సెల్ఫీ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్లతో స్వీయచిత్రాలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎగబాకుతోంది.ఇప్పుడు సెల్ఫీ క్వీన్ గా పేరుపొందిన ఒక యువతీ కూడా చనిపోయింది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for సెల్ఫీ క్వీన్ సెల్ఫీ

సోషల్ మీడియా సెల్ఫీ క్వీన్‌గా పేరుగాంచి తైవాన్ దేశానికి చెందిన గిగి వూ చివరకు సెల్ఫీ తీసుకుంటూనే ప్రాణాలు కోల్పోయింది. ఈనెల 19వ తేదీన జరిగిన ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, తైవాన్ దేశంలోని న్యూ తైపీ నగరానికి చెందిన గిగి వూ అనే యువతికి ఎత్తైన ప్రదేశాల నుంచి సెల్ఫీలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమంటే మహా సరదా.అలా తైవాన్‌లోని యుషాన్ నేషనల్ పార్కు‌లోని ఎత్తైన పర్వతంపై అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తుజారి వంద అడుగుల లోతులో పడిపోయింది. దీంతో ఆమె కదల్లేని స్థితిలో అక్కడే చిక్కుకుపోయింది. అయితే తాను ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని మాత్రం శాటిలైట్ ఫోన్ ద్వారా తన స్నేహితులకు గిగి వూ చేరవేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ వెంటనే రంగంలోకి దిగిన తైవాన్ రెస్క్యూ బృందాలు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, వాతావరణం సరిగా లేకపోవడంతో హెలికాఫ్టర్లు ఆ ప్రాంతానికి చేరుకోలేక పోయాయి. ఫలితంగా సెల్ఫీ క్వీన్ ప్రాణాలు విడిచింది. వాతావరణం అనుకూలించిన తర్వాత మృతదేహం కోసం గాలిస్తామని రెస్క్యూ బృందాలు తెలిపాయి.చూశారుగా కాబట్టి సెల్ఫీలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎత్తైన ప్రదేశాలలో ప్రమాదకర ప్రాంతాలలో సెల్ఫీలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. సెల్ఫీ మోజులో ప్రాణాలు వదిలిన ఈ సెల్ఫీ క్వీన్ గురించి అలాగే ఇలా సెల్ఫీల మోజులో ప్రాణాలు పోగొట్టుకున్న ఎందరో యువతీయువకుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.