విజయారెడ్డి ఆస్తులు తెలిస్తే మతిపోతుంది

2040

పట్టపగలు.. ప్రభుత్వ కార్యాలయం.. మహిళా తహశీల్దారు హత్య. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థంకాలేదు. వ్యక్తిగత కక్షలని కొందరు భావిస్తే, విజయానే ఆత్మహత్య చేసుకుందని మరికొందరు భావించారు. కాని చివరకు ఎట్టకేలకు ఈ హత్య వెనక కారణాల్ని బయటకు తీశారు పోలీసులు. వృత్తిపరంగా ఎదురైన కక్షల వల్లనే విజయా రెడ్డి హత్య జరిగినట్టు స్పష్టంచేశారు.దాదాపు రెండేళ్లుగా ఓ సమస్య పరిష్కారం కోసం విజయారెడ్డి చుట్టూ తిరుగుతున్నాడు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం బాచారం గ్రామస్తుడు సురేష్. దాదాపు 412 ఎకరాలకు సంబంధించిన భూవివాదం ఇది.

Image result for tahsildar vijaya reddy

నిజానికి ఈ భూములు వాళ్లవి కావు, గతంలో ఓ జమీందార్ కు చెందినవి. అతడు కుటుంబంతో పాటు మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో కొంతమంది కలిసి సాగు చేసుకుంటున్నారు.రియల్ ఎస్టేట్ కారణంగా తాజాగా ఈ భూముల విలువ పెరిగింది. దీంతో కోర్టు కేసులు కూడా పడ్డాయి. దాదాపు 130 ఎకరాల భూమి తమదంటూ మరికొంతమంది కేసులు వేశారు. అయితే ఆ 130 ఎకరాల్లో తనకు వారసత్వంగా వచ్చిన రెండెకరాలు కూడా ఉందని వాదిస్తున్నాడు సురేష్. దీనికి సంబంధించి ఏడాదిగా విజయా రెడ్డిని తరుచుగా సంప్రదిస్తున్నాడు. కాని ఆమె మాత్రం ఇది కోర్టులో ఉన్నకేసు అని చెప్పింది దీంతో ఆమెపై ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు.తనకు సంబంధించిన భూమిని విజయారెడ్డి తనకు కాకుండా చేసిందనే కక్షతో సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆఫీస్ లో ఎవరూ లేని టైమ్ చూసి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై పోసి నిప్పంటించాడు.

Related image

అయితే ఎమ్మార్వో అక్కడికక్కడే మరణించారు, ఇక సురేష్ చికిత్స పొందుతూ మరణించాడు.ఈ సమయంలో విజయారెడ్డి గురించి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, ఆమెకు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి, అంతేకాదు ఖరీదైన వస్తువులు ఉన్నాయి అని అంటున్నారు, ఆమె ఇళ్లు కూడా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు, నెలకు 40 నుంచి 50 వేల జీతం వచ్చే ఎమ్మార్వోకి ఇంత ఇళ్లు ఎక్కడ నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు, సాధారణ రైతులని కొందరు అధికారులు పీక్కుతుంటున్నారు అని అంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈరోజు ఓ అవినీతి తిమింగళం బయట పడింది..పురపాలక శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గా జాబ్ లో చేరిన మురళీగౌడ్ ఇప్పుడు విజయవాడ టౌన్ ప్లానింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. నంద్యాలకు చెందిన ఇతగాడి ఇంటి మీదా.. అతడి బంధువులు.. స్నేహితులు.. పరిచయస్తుల ఇళ్ల మీద ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన దాడుల్లో షాకింగ్ నిజాలు బయటకు రావటమే కాదు.. అతడికున్న ఆస్తుల లెక్కకు మించి ఉన్నాయి. ఏకంగా 100 కోట్లు పోగేసాడు, దీని బట్టి చెప్పవచ్చు కొందరు అధికారులు అక్రమార్జన ఎంత దారుణంగా ఉందో. అయితే ఇక్కడ విజయారెడ్డి గురించే కాదు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోవడం మానేస్తే ప్రజల్లో కూడా ఎలాంటి తిరుగుబాటు ఉండదు అంటున్నారు ప్రజలు, మొత్తానికి ఆమె ఆస్తుల గురించి వస్తున్న వార్తలపై విచారణ కూడా చేయనుంది ప్రభుత్వం. అయితే ఉద్యోగులు పనిచేయకపోతే లంచాలు డిమాండ్ చేస్తే కచ్చితంగా ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వాలి.. కాని ఇలా భౌతిక దాడులకు పాల్పడటం
మంచి పద్దతి కాదు.

ఈ క్రింద వీడియో చూడండి