రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని Swiggy Boy ఏం చేసాడో చూస్తే షాక్

170

జనాలు ఫుడ్ డెలివరి యాప్స్‌కి అలవాటు పడిపోయారు. అవి అందించే ప్రత్యేక ఆఫర్స్‌కు ఆకర్షితులై ఇంట్లో వంట చేసుకోవడం కూడా మానేశారు.భార్యభార్తలు ఇద్దరూ ఉద్యోగస్థులైతే మాత్రం రోజుకో డెలివరి తప్పనిసరిగా మారిపోయింది. మనం కోరిన హోటల్‌ నుంచి మనకు కావల్సిన ఆహారాన్ని నిమిషాల్లో మన ఇంటి వద్దకు డెలివరి బాయ్స్ తీసుకొచ్చేస్తున్నారు. కానీ ఫుడ్ డెలివరి సంస్థల నుంచి కస్టమర్స్‌కు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎక్కువగా ఆ సంస్థలకు చెందిన డెలివర్స్ బాయ్స్ నుంచి వినియోగదారులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు . సగం తీనేసిన ఆహారాన్ని డెలివరి చేయడం, లైంగిక దాడులు, అసభ్య ప్రవర్తన లాంటి సమస్యలతో ఫుడ్ డెలివరి సంస్థలు అపకీర్తిని మూటగట్టుకుంటున్నాయి.

Image result for swiggy

అయితే తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ స్విగ్గీలో పుడ్ కోసం ఆర్డర్ చేసింది. దాన్ని అందజేయడానికి వచ్చిన డెలివరీ బాయ్‌ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ ఫుడ్‌ పార్శిల్‌ని లాక్కొని లోపలికి వెళ్లి తలుపులు మూసేసింది. దీంతో తనకు ఎదురైన అవమానం గురించి స్విగ్గీ సంస్థ కస్టమర్‌ సర్వీస్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆ సంస్థ ఆమెకు క్షమాపణలు చెప్తూ ఒక లేటర్‌తో పాటు రూ. 200 విలువ చేసే ఒక స్విగ్గీ కూపన్‌ను పరిహారంగా పంపించింది. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం మానేసి ఇలా చేయడం ఏంటని ఆవేదన చెందిన ఆమె ఫేస్‌బుక్ ద్వారా తన బాధను వ్యక్తం చేసింది. క్షమాపణలతో ఈ సమస్యను వదిలివేయకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన స్విగ్గీ సంస్థ ప్రతినిధులు ఆమెకు ఫేస్‌బుక్‌లో క్షమాపణలు కోరారు. నిందితునిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాజాగా మరో ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఒక ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్ధకు చెందిన ఓ యువకుడు నైట్ షిఫ్టు ముగించుకుని వస్తున్న ఓ ఐటీ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట, తాను లిఫ్ట్ ఇస్తానని తన రూమ్ దగ్గర్లో ఉందని తన రూమ్ కు రావాలని కోరాడు. అంతేకాదు రోజూ ఫుడ్ డెలివరీ ఉచితంగా చేస్తాను, రూమ్ కి రమ్మని ఆపర్ ఇచ్చాడట, దీంతో సదరు యువతి ఆ డెలివరీ బాయ్ ఫోటోని బండి ఫోటోని తీసి పోలీసుకు కంప్లైంట్ చేసింది. అయితే తాను ముందు తప్పు చేయలేదు అని చెప్పినా, చివరకు పోలీసుల విచారణలో తప్పు ఒప్పుకున్నాడు, ఆమె దైర్యంగా అతని ఫోటోతో పాటు బండి నెంబర్ ఇవ్వడంతో పోలీసులకు సులువుగా చిక్కాడు ఈ బాయ్, అయితే అతనిని ఉద్యోగం నుంచి తీసేసింది సదరు ఫుడ్ సంస్ద.. ఇటీవల ఇలాంటి కంప్టైంట్స్ ఎక్కువ వస్తున్నాయని చాలా జాగ్రత్తగా ఉండాలని వేధింపులకు ఎవరు గురిచేసినా తమకు కంప్లైంట్ ఇవ్వాలంటున్నారు పోలీసులు.