ప్రజలను బాధపెట్టొద్దు, సగం సంతోషమే.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

496

ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల జాతరలో భాగంగా నిర్వహించే రంగం సోమవారం జరిగింది.ఈ బోనాలు అంగరంగవైభవంగా జరిగాయి.ఉదయం 10.40 గంటలకు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.రాబోయే కాలం ఎలా ఉంటుంది ? జనాలు ఎలా నడుచుకుంటారు ? అమ్మవారి దయ ఎలా ఉంటుంది ? తదితర విషయాలపై అమ్మవారి సేవకు అంకితమైన స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు..ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కానీ ఈసారి విభిన్నంగా భవిష్యవాణిని వినిపించడం గమనార్హం.మరి స్వర్ణలత ఏం చెప్పిందో తెలుసుకుందామా.

Image result for swarnalatha bhavishyavani

హైదరాబాద్నగరంలోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన ‘రంగం’లో మాతంగి స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. ఈ సందర్భంగా పూజారులు, ఇతరులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ప్రజలను పాలకులు ఇబ్బందులు పెట్టొద్దని అన్నారు.పాలకులు, ప్రజలు అందరూ తన బిడ్డలేనని అన్నారు. బంగారు బోనం సమర్పించాం, అంత సవ్యంగా చేశామని సంతోషమే కదా అమ్మా అని పూజారులు అడగ్గా నా బోనం నాకే సమర్పించారు కదరా బిడ్డా అని అన్నారు స్వర్ణలత. బంగారం బోనంతో కొంత సంతోషం, కొంత బాధ ఉందని అన్నారు.తన వద్దకు వచ్చిన వారు దుఖంతో వస్తున్నారని, భక్తులను సంతోషంగా పంపించాలన్నారు.

Related image

సంతోషంగా ఎందుకు ఉండడం లేదు ? అని ప్రశ్నించారు. బయటకు వచ్చి చూడాలని, ఆడపడుచులు ఎంతో దుఖంతో ఉన్నారన్నారు. ప్రజలందరినీ సంతోషంగా చూసే బాధ్యత తనదేనని, ఇబ్బందులు మాత్రం పెట్టవద్దన్నారు. మేలు కాదు..కీడు చేస్తున్నారని ఆక్షేపించారు.పాలకులు ప్రజలకు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారని కానీ, బాధ పెడుతున్నారని స్వర్ణలత భవిష్యవాణిలో చెప్పారు. ఈ ఏడాదంతా సంతోషం లేకుండా పోయిందని అన్నారు.ఇటీవల కాలంలో హిందూ మతాన్ని, హైందవ జాతిని కించపరుస్తున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉందని, ఇటువంటి వాళ్లకు ఎలాంటి శిక్ష విధిస్తావని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “నేను న్యాయం పక్షానే నిలుస్తాను.

ఉజ్జయిని మహంకాళినిరా నేను. ఎవరెన్ని మాటలన్నా జాతికి రక్షగా నేనుంటా. తప్పనిసరిగా శిక్షిస్తా నేను. శిక్షిస్తాను. రక్షిస్తాను కూడా” అని చెప్పింది.వర్షాలు పడక రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని పూజారులు చెప్పగా.. కోరినన్ని వర్షాలు కురుస్తాయని అన్నారు. వర్షాలు బాగా కురుస్తాయని, పాడిపంటలు బాగుంటాయని చెప్పారు. తన బిడ్డలకు ఎలాంటి ఆపదా రానివ్వనని స్వర్ణలత చెప్పారు.ఇదేనండి ఉజ్జయిని అమ్మవారు చెప్పిన విషయాలు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.వీటిని మీరు నమ్ముతారా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.