విజయారెడ్డి కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన సురేష్ భార్య

244

ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసులో అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.. ఈ సమయంలో నిందితుడు సురేష్ భార్య అతని గురించి కొన్ని విషయాలు తెలియచేసింది..తన భర్త అమాయకుడని తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య లత తెలియచేశారు. రెండు రోజుల క్రితం తహసీల్దార్ విజయారెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి తగలపెట్టిన సంగతి తెలిసిందే…. ఆమె అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. సురేష్ మాత్రం 60శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Image result for tahsildar vijaya reddy

తన భర్త చాలా అమాయకుడని ఆమె చెప్పారు. ఎవరో తన భర్తను పావుగా వాడుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. విజయారెడ్డి హత్య వెనుక మరెవరో ఉన్నారని ఆమె అన్నారు. వారెవరో పోలీసులే బయటపెట్టాలని ఆమె కోరారు. గత రెండు నెలలుగా భూమి పోతుందనే ఆందోళనలో తన భర్త ఉన్నాడని ఆమె చెప్పారు. నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. తన భర్త సురేష్ హత్య చేశాడంటే తాను నమ్మనని ఆమె వాపోయారు. భూమి గురించి ఎప్పుడూ తన భర్త కుటుంబసభ్యులతో పంచుకోలేదని ఆమె చెప్పారు. తను కుటుంబాన్ని కూడా పెద్దగా పట్టించుకోడని రెండు నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అని ఆమె తెలియచేశారు, ఆయన ఎవరి ముఖం చూసి కూడా మాట్లాడరు అలాంటి వ్యక్తి ఆమెని చంపాడు అంటే నమ్మలేకపోతున్నాం అంటున్నారు.

Image result for tahsildar vijaya reddy

60శాతం గాయాలపాలైన సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ రోజు మరోసారి ఉస్మానియా ఆస్పత్రికి రాచకొండ పోలీసులు వెళ్లనున్నారు. ఇప్పటికే నిందితుడు సురేష్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. సురేష్ కి చెందిన 9 ఎకరాల భూమి వివాదమే హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను ఆయన విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనాస్థలంలో సురేష్ తోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇదిలా ఉండగా..విజయారెడ్డి హత్యకేసులో మరిన్ని నిజాలు బయటకు వెలుగు చూస్తున్నాయి. ఆఫీసులో సెక్యురిటీ పెంచాలని నెల క్రితమే విజయా రెడ్డి కలెక్టర్ ని కోరినట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూములపై ఆందోళన పెరగుతుండటంతో.. గతంలోనే విజయారెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా సురేష్ కి చెందిన 9 ఎకరాల భూమిని మాజీ ప్రజాప్రతినిధికి అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన రోజు సురేష్ చాలా మందితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. సురేష్ కాల్ లిస్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నారు. హత్య చేసిన తర్వాత పక్కనే ఉన్న ఓ కారులోని వ్యక్తితో సురేష్ మాట్లాడినట్లు గుర్తించారు. కాగా.. సురేష్ ఎవరితో మాట్లాడాడో పోలీసులు ఆరా తీస్తున్నారు.. అయితే అతని ఆరోగ్య పరిస్దితి విషమంగా ఉందని చెబుతున్నారు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పారు.

ఈ క్రింద వీడియో చూడండి