రేపే సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతి

721

2018లో అరుదైన చంద్ర గ్రహణాలను చూసే అవకాశం మనకు లభించింది. అరుదైన అరుణవర్ణ సుదీర్ఘ సంపూర్ణ చంద్ర గ్రహణం, సూపర్ బ్లడ్ మూన్ లాంటి గ్రహణాలు వచ్చాయి. అయితే ఈ ఏడాది కూడా మరో భిన్నమైన చంద్ర గ్రహణాన్ని చూసే అవకాశం లభించనుంది. ఈ గ్రహణం పేరు ‘సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్’. ఈ పేరుకు తగినట్లే.. ఒకే గ్రహణం మూడు రకాలుగా కనిపిస్తుంది. వివిధ దేశాల కాలమానాల ప్రకారం జనవరి 20, 21 తేదీల్లో ఏర్పడుతుంది. చంద్రగ్రహణం, సూపర్ బ్లడ్ మూన్, వోల్ఫ్ మూన్‌లు ఒకేసారి ఏర్పడనున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనికి ‘సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్’ అని పేరు పెట్టారు.

అయితే ఈ నెల 21 న వచ్చే చంద్ర గ్రహణం మన భారత దేశంలో కనిపించటం లేదు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం పుష్య మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి తిధి రోజున జనవరి 21 సోమవారం ఉదయం 10.11 గంటలకు ఈ గ్రహణం ఏర్పడుతుంది. 62 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణం మొదలై పూర్తికావడానికి సుమారు 3 గంటల 50 నిమిషాలు పడుతుంది.ప్రపంచం అంతా ఈ గ్రహణాన్ని వీక్షించాలని ఎదురు చూస్తున్నారు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం మన భారత దేశంలో కంపించటం లేదు. కాబట్టి మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ చంద్ర గ్రహణాన్ని రాహు గ్రస్త చంద్ర గ్రహణం అని శాస్త్రజ్నులు చెప్పుతున్నారు. గ్రహణం అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? గ్రహణ నియమాలు పాటించాలా? గర్భవతులు జాగ్రత్తగా ఉండాలా? అనే సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ చంద్ర గ్రహణం పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. మన భారత కాలమానం ప్రకారం చంద్ర గ్రహణం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది.

చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపుతాడు. కాబట్టి ఈ చంద్ర గ్రహణం సమయంలో సింహా రాశి,కర్కాటక రాశి వారు శివభిషేకాలు చేయించుకుంటే మంచిది. మన భారత దేశంలో కనిపించకపోయిన మనః కారకుడు చంద్రుడు కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పరిహారం చేయాలి. గ్రహణ పట్టు స్నానం, విడుపు స్నానం చేయవలసిన అవసరం లేదు. గర్భవతులు కూడా కదలకుండా కూర్చోవాలనే జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. కర్కాటక రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కర్కాటక రాశివారు, ఆ రాశికి ముందు రాశి వెనక రాశి మిధున రాశి, సింహా రాశి వారు కూడా జనవరి 22 న శివభిషేకం చేయించుకుంటే మంచిది. ఒకవేళ అభిషేకం చేయటం కుదరకపోతే ఓం నమశ్శివాయ మంత్రాన్ని 11 సార్లు లేదా 108 సార్లు పఠిస్తే గ్రహణం ప్రభావం తగ్గుతుంది. ఓం నమశ్శివాయ మంత్రాన్ని గ్రహణ సమయంలో పఠిస్తే వెయ్యి రేట్లు ఫలితం ఉంటుంది.కాబట్టి అందరు పాటించండి. మరి ఈ సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ గురించి అలాగే కొన్ని రాశులవారు పాటించాల్సిన నియమాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.