చెత్త ఏరుకునే ఓ తండ్రి..కొడుకు పెద్ద డాక్టర్..ఈ సక్సెస్ స్టోరీ చూస్తే టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదంటారు

620

ఇంజినీరింగ్ అనగానే మంచి ఐఐటీలో సీటు దొరికితే చాలు, అది ఎంత ప్రతిష్ఠాత్మకమో, ఎంతటి కష్టతరమో, ఎంతటి ఉపయోగకరమో ప్రతి పిల్లాడికీ తెలుసు… ప్రతి పేరెంటుకూ తెలుసు… మరి మెడిసిన్…? ఎయిమ్స్…! ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్… దేశంలోకెల్లా పేరొందిన వైద్య కళాశాల… ఇక్కడ సీటు సంపాదించడం అంటే దాదాపు ఐఏఎస్ క్రాక్ చేసినంత కష్టం… దాని ఎంట్రన్స్ టెస్టు అలా ఉంటుంది…

2016 పరీక్షల డేటా చూస్తే, ఈ పరీక్ష రాసినవారిలో కేవలం 0.35 శాతం మంది మాత్రమే సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది మనకు… అంత మంది పోటీపడతారు ప్లస్ అంత కష్టమన్నమాట… మధ్యప్రదేశ్‌, దీవాస్ జిల్లాకు చెందిన ఆశారాం చౌదరి దాన్ని సాధించాడు… వాడావాడా తిరిగి చెత్త ఏరుకునే ఓ తండ్రి కొడుకు తను… తనుండే గుడిసె కమ్ షెడ్డు కమ్ ఇంటికి కనీసం కరెంటు కనెక్షన్ కూడా సరిగ్గా లేదు… ఈ బ్యాక్ గ్రౌండ్ నుంచీ ఆ సీటు సాధించి, జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో క్లాసులకు కూడా అటెండవుతున్న ఆశారాం చౌదరిని చూస్తే మరోసారి గుర్తొచ్చేది…. ప్రతిభ ఎవడి సొత్తు..?!

ఆల్ ఇండియా కేటగిరీలో 707 ర్యాంకు, నీట్ ఓబీసీ కేటగిరీలొో 141వ ర్యాంకు వచ్చింది… అదీ ఫస్ట్ ప్రయత్నంలోనే..!
నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మా నాన్న సంపాదన రోజుకు 20 లేదా 30 రూపాయలు… దగ్గరలో ఓ డాక్టర్ ఉండేవాడు… క్వాలిఫైడ్ కాదు, కానీ ప్రజలు ప్రతి చిన్న సమస్యకూ ఆయన్నే ఆశ్రయించేవారు… అప్పుడు అనిపించింది జీవితంలో డాక్టర్ కావాలని… ఆ కల నేను నిజం చేసుకుంటున్నాను..అంటున్నాడు ఆశారాం… తను స్కూలింగులో జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థి…
టెన్త్ తరువాత దక్షణ ఫౌండేషన్‌లో చేరాను… వాళ్లు దేశం మొత్తమ్మీద 75 మందిని ఎంపిక చేసి ఐఐటీ, మెడికల్ ఎంట్రన్సులకు శిక్షణ ఇస్తుంటారు… వాళ్లు ఓ ఎంట్రన్స్ పెడతారు, అందులో పాసయితేనే తీసుకుంటారు… ఫ్రీ శిక్షణ… వెనుకబడిన పరిస్థితుల్లో ఉన్న నాలాంటి విద్యార్థులకు ఇది ఓ వరం… ఒకవైపు నా రెగ్యులర్ చదువు కొనసాగిస్తూనే, దక్షణ క్లాసులకు అటెండయ్యేవాడిని… ఎయిమ్స్ ఎంట్రీకి కష్టపడటం అంటే అదేమీ పూలపాన్పు కాదు, పరీక్షలు దగ్గరకొచ్చాయంటే రోజుకు మహాఅయితే రెండు మూడు గంటలు నిద్రపోయేవాడినేమో…


పరీక్షలకు ఒక నెల ముందు సెల్ఫ్ ప్రిపరేషన్‌కు బ్రేక్ ఇస్తారు… మాకేమో ఇంట్లో కరెంటు లేదు, ఓ కిరోసిన్ దీపంతో కుస్తీపట్టేవాడిని, లేదా ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్లేవాడిని… ఎంట్రన్స్ ఫీజు కట్టడానికి డబ్బు లేకపోతే మా బయాలజీ టీచర్ అమిత్ కుమార్ సాయం చేశాడు… పుస్తకాలు కొనిచ్చాడు… నా ఎంట్రన్స్ రిజల్ట్ వచ్చిన రోజు మా నాన్న ఆనందాన్ని వర్ణించలేను, ఆ రాత్రి తను నిద్రపోలేదు కూడా… అని వివరించాడు… గ్రేట్… ఇది ఆనోటా ఈనోటా విని, పత్రికల్లో వచ్చిన వార్తలు చదివి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తన ఉన్నత చదువు మొత్తం బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది’ అని ప్రకటించాడు

జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పాండే వెంటనే తనను పిలిచి తక్షణ ఖర్చుల కోసం 25 వేల చెక్కు ఇచ్చాడు… ఆశారం చెల్లె నర్మద, తమ్ముడు సీతారాం గనుక చదువుల్లో ప్రతిభ చూపిస్తే, వాళ్ల చదువుల బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పాడు… తండ్రి రంజిత్ చౌదరి కష్టమ్మీద కట్టుకున్న గుడిస్ కమ్ షెడ్ స్థానంలో ఓ పక్కా ఇల్లు, టాయిలెట్ కట్టిస్తామని, కరెంటు కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చాడు… అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి స్పందించాడు… తన చదువుకు సపోర్టుగా ఉంటానని ప్రకటించాడు… అది ఏ రూపంలో ఎలా అనేది వర్కవుట్ చేస్తున్నట్టు హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ అనుపమ్ సిబాల్ చెప్పారు… కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ లెటర్ రాస్తూ అభినందనలు తెలిపాడు… మరికొందరు కూడా సాయం చేయటానికి ముందుకొస్తున్నారు… నాకు పుస్తకాలు, ఫీజుల కోసం సాయం చాలు, ఎక్కువ ఇచ్చినా తీసుకోను అంటున్నాడు ఆశారాం… అదీ గొప్పదనం… విదేశాలకు వెళ్లను, న్యూరో సర్జన్ అవుతాను,