విద్యార్ధులు ఈ 7 పనులు ఎప్పటికి చెయ్యకూడదు

992

చ‌దువుకున్న వాడు ఏదో ఓ ప‌నిచేసి బ‌తుకుతాడు అని, అందుకే చ‌దువు విలువ చిన్నత‌నం నుంచి నేర్పుతారు… చ‌దువు ఉంటే జీవింతంలో ఏమైనా సాధించ‌వ‌చ్చు అని చెబుతారు… విద్య అన్నిటి కంటే ప్ర‌ధాన‌మైన‌ది గా చెప్ప‌వ‌చ్చు… మంచి చ‌దువు మంచి భ‌విష్య‌త్తును అందిస్తుంది. చిన్న‌త‌నంలో చెడువైపు వెలితే ఎదిగే కొల‌ది మ‌న జీవితం చెడుకు వెళుతుంది.. అందుకే చాణిక్యుడు మ‌న జీవితంలో పైకిరావ‌డానికి అనేక మార్గాలు సూత్రాలు చెప్పాడు.. వాటిని చ‌దువుకునే విద్యార్దులు త‌ప్ప‌క తెలుసుకోవాలి.. వీటిని పాటిస్తే వారు జీవితంలో అనుకున్న ఉన్న‌త స్దానాలు చేరుకుంటారు.. ఓసారి చాణిక్యుడు ఎటువంటి మార్గ‌సూత్రాలు విద్యార్దుల‌కు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for romance

శృంగారం ప‌ట్ల‌ ఆస‌క్తి …

స్త్రీ పై వ్యామోహం యుక్త వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రికైనా ఉంటుంది.. అయితే కామ కోరిక‌లు రావ‌డం కంటే వాటిని నియంత్రించుకోవ‌డం గొప్ప విష‌యం.. ఇలా చదువుకునే స‌మ‌యంలో శృంగార కోరిక‌లు క‌లిగినా వాటిని నిగ్ర‌హించుకోవాలి.. ఎటువంటి అనైతిక అక్ర‌మ సంబంధాలు పెట్టుకోకూడ‌దు.. ముఖ్యంగా చ‌దువుకుంటున్న స‌మ‌యంలో ఇలాంటి అలవాట్లు అల‌వాటు అయితే.. మీ జీవితం వ‌ర‌స్ట్ ట‌ర్న్ తీసుకుంటుంది.. అందుకే చాణిక్యుడు అతి ముఖ్య‌మైన విష‌యంగా దీనిని చెప్పాడు.

కోపం..

. ఇది మ‌నిషి నాశ‌నానికి ఓ ప్రధాన కార‌ణం.. అందుకే మ‌నిషికి అస‌లు కోపం ఉండ‌కూడ‌దు.. ఇలా కోపం లేనివారే ప్ర‌పంంచంలో అనేక ఆవిష్క‌ర‌ణ‌లు చేసిన‌వారు ఉన్నారు.. ఓపిక ఉంటే కోపం ఉండ‌దు, కోపం ఉండ‌క‌పోతే జీవితంలో ఏది అయినా సాధిస్తాం.. ఇక కోపం లేని వాడు ఆరోగ్యంగా కూడా ఉంటాడు.. అత‌నికి దీర్ఘాయుష్యు కూడాఉంటుంది. ఇలా కోపం చిన్న‌త‌నం నుంచి అల‌వాటు చేసుకోవ‌డం చీటికి మాటికి గొడ‌వ‌ల‌కు కార‌ణం అవుతుంది.. దేనిని అయినా సామ‌రస్యంగా ప‌రిష్క‌రించుకోవాలి ఇలా కోపాల‌కు పోతే విధ్యార్ది జీవితాలు ఇబ్బందుల పాల‌వుతాయి.

Image result for angry

దురాశ …. మ‌నిషి ఆశ‌తోనే బ‌తుకుతాడు.. దురాశ‌తో చ‌స్తాడు అనేది నానుడి. దురాశ‌ దుఖానికి చేటు నిజ‌మే దురాశ ఎప్పుడు అయితే మ‌న మెద‌డులో వ‌స్తుందో అప్పుడే ప‌త‌నం మొద‌లు అవుతుంది.. అందుకే విద్యార్దులు చిన్న‌త‌నం నుంచి ఈ దురాశ‌కు దూరంగా ఉండాలి.

రుచి .. విద్యార్దులు చ‌దువుకునే స‌మ‌యంలో తిండి పై అంతశ్ర‌ద్ద‌పెట్ట‌క్క‌ర్లేదు వారికి న‌చ్చిన ఆహారం లేక‌పోయినా తిన‌డం అల‌వాటు చేసుకోవాలి.. ఇలా చిన్న‌త‌నం నుంచి అల‌వాటు చేసుకుంటే వారికి పెద్ద అయిన త‌ర్వాత కూడా ఎటువంటి స‌మ‌స్య ఎట్టి ప‌రిస్దితుల్లోవ‌చ్చినా ఫేస్ చేసే సామ‌ర్ద్యం పెరుగుతుంది.

Image result for taste food

అలంక‌ర‌ణ‌… విధ్యార్దులు ప్ర‌తీ నిమిషాన్ని చ‌దువుకు ఉప‌యోగించుకోవాలి.. ఆ స‌మ‌యంలో అందానికి అలంక‌ర‌ణ‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌కూడ‌దు.. ఇలా చేయ‌డం వ‌ల్ల అందం అలంక‌ర‌ణ రోజూ చేసుకోవాల‌ని ఆక‌ర్షించాలనే కోరిక‌త‌ల‌తో ప‌క్క‌దారి ప‌డ‌తారు.

వినోదం .. జీవితంలో వినోధం ఓ భాగంగాఉండాలి కాని వీనోద‌మే జీవితం అనుకుంటే, జీవితాంతం బాధ‌ప‌డాల్సి ఉంటుంది.. అందుకే వినోదానికి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌కూడ‌దు.. ఇలా వినోదానికి ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తే మీ చ‌దువుల‌పై మీరు పూర్తిగా శ్ర‌ద్ద పెట్ట‌లేరు. అందుకే విద్యార్దులు వినోదానికి దూరంగా ఉండాల‌ని చెప్పాడు చాణిక్యుడు

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నిద్ర… ఏదైనా మితంగా ఉండాలి.. తిండి అయినా నిద్ర అయినా.. అందుకే నిద్ర మితంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.. కొంద‌రు చాలా ఎక్కువ సేపు నిద్ర‌పోతారు.. అలాంటి వారు జీవితంలో ఎటువంటివి సాధించ‌లేరు.. చూశారుగా చాణిక్యుడు చెప్పిన మంచిపాయింట్స్, మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం విద్యార్దుల‌ను ఇవి పాటించ‌మ‌ని చెప్పండి.. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.