కారణం తెలిసి పోలీసులే బిత్తరపోయారు

226

ఆడపిల్లకు ఎక్కడ భద్రత లేకుండా పోయింది. తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతవరకు సేఫ్ గానే ఉంటున్న ఆడపిల్ల కాలు తీసి బయటపెడితే వారికి ఎలాంటి అపాయం కలుగుతుందో అర్థం అవ్వడం లేదు. అయితే చదువు కోసమనో లేక ఉద్యోగం కోసమో వేరే ప్రదేశాలలో ఉండాల్సిన పరిస్థితి. అయితే బయట రూమ్ లలో ఉంటె సేఫ్టీ కాదని హాస్టల్ ను ఎంచుకుంటారు. ఇక చిన్న పిల్లలు అయితే వారిని ఖచ్చితంగా హాస్టల్ లలోనే ఉంచుతారు. ప్రభుత్వం కేసుల ఆడపిల్లల రక్షణ కోసం బాలికల హాస్టల్స్ ను నిర్మించారు. అక్కడ అయితే వారికి భద్రత ఉంటుందని నమ్మకం. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఆడపిల్లకు భద్రత లేకుండా పోయింది. ఆ మధ్య ప్రభుత్వ హాస్టల్ లో ఉన్న ఒక అమ్మాయి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళి అలంటి ఘటనే చోటుచేసుకుంది.

Image result for ladies hostels

ప్రభుత్వం నడిపిస్తోన్న హాస్టళ్లలో నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చిన ఘటనలు ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో బాలికల వసతి గృహాలు నిర్వహిస్తున్నారరు. వీటిలోని రెండు హాస్టళ్లలో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) నుంచి తమకు నివేదిక అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనూప్ సాహూ వెల్లడించారు. విద్యార్థినులు వేసవి సెలవులకు ఇళ్లకు వెళ్లి ప్రస్తుతం స్కూళ్లు తెరవడంతో తిరిగి వచ్చారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు హాస్టళ్లలోని నలుగురు విద్యార్థినులు గర్భవతులని తేలిందని సాహూ తెలిపారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఒడిశాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినులు గర్భం దాల్చుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఖుర్దా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ బాలల ఆరోగ్య పథకం(ఎన్‌సీహెచ్‌సీ) ఆధ్వర్యంలోని సంచార వైద్య పరీక్షల బృందం వేసవి సెలవుల తర్వాత తిరిగి వసతిగృహాల్లో చేరిన పలువురు విద్యార్థినులకు వివిధ పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో భువనేశ్వర్‌లోని రెండు వసతిగృహాల్లోని నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చినట్లు గుర్తించారు. ఆ నివేదిక అందుకున్న సీడబ్ల్యూసీ ప్రతినిధులు పోలీసు కమిషనర్‌ సత్యజిత్‌ మహంతికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సత్యజిత్, ఆరోగ్య పరీక్షల నివేదికను పరిశీలిస్తున్నామని, వారికి మరోసారి ఇవే పరీక్షలు చేసి ఏం చేయాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరి ఈ ఘటన గురించి మీరేమంటారు. నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చిన ఈ ఘటన గురించి సమాజంలో రోజురోజుకు ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతున్న విషయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.