విచిత్ర ఊరు : ఇంటి అద్దెగా డబ్బులకు బదులు సెక్స్ చేస్తారు..

862

మనం రకరకాల ప్రకటనలు చూసి ఉంటాం. డ్రైవర్లు కావాలి.. టీచర్లు కావాలి.. వరుడు కావాలి.. ఇల్లు అద్దెకు ఇస్తాం.. ఇల్లు అమ్ముతాం… ఇలా వందల రకాల యాడ్స్ పేపర్లలో వస్తుంటాయి. కానీ మీకు ఇల్లు అద్దెకు కావాలంటే మాతో సెక్స్ లో పాల్గొనండి… రెంట్ ఫర్ సెక్స్ అనే ప్రకటనలను మాత్రం అస్సలు చూసి ఉండం. కానీ ఇంగ్లడ్ లోని లండన్ లో ప్రధాన పత్రికల్లో, వెబ్ సెట్లలో ఇలాంటి యాడ్స్ రోజూ వస్తూ ఉంటాయి. ఇంటి అద్దె అవసరం లేదు.. కాకపోతే మాతో సెక్స్ కు ఒప్పుకోండి చాలు.. అందూ కొందరు ఇంటి యజమానులు పబ్లిక్ గ్గా ప్రకటనలు ఇస్తున్నారు. ఒంటరిగా ఉండే మహిళల్ని టార్గెట్ చేసి ఇలాటి ప్రకటనలు ఇస్తున్నారు ఇంటి యజమానులు. వాస్తవానికి ఇలాంటి ప్రతిపాదనలు పంపడం.. ప్రకటనలు ఇవ్వడం కూడా నేరాల జాబితాలోకే వస్తాయి.

Image result for village houses girls

కానీ ఈ ప్రతిపాదనల గురించి ఫిర్యాదు చేసేవారు ఎవరూ లేరు. కొందరు రెంట్ ఫర్ సెక్స్ కు ఒకే అనుకుని ఇళ్లల్లో చేరిపోతున్నారు. మరికొందరు మౌనంగా ఉంటున్నారు. ఈ సమస్య తీవ్రత ఇప్పుడు ఇంగ్లాడ్ లో బాగా పెరిగిపోయింది.ఇంటి నుంచి బయటకొచ్చి నిరాశ్రయురాలైన 14 ఏళ్ళ యువతి రెంట్ ఫర్ సెక్స్ కు అంగీకరించాల్సి వచ్చింది. అలాగే క్లో అనే 18 ఏళ్ల అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు ఆమె రిలేషన్ గురించి తెలిసి ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఆ సమయంలో క్లో లండన్ లో ఇంటి కోసం వెతకడం మొదలుపెట్టింది. క్లో పేపర్లలో ప్రకటనలు చూసింది. అందులో ఒక ప్రకటన కనపడింది. ఇంటి రూఫ్ పై ఉన్న గది ఇవ్వడానికి ఒక ఇంటి యజమాని రెడిగా ఉన్నాడు. కానీ ఇంటి అద్దెకు బదులుగా అతని దగ్గర పడుకుంటేనే క్లో కు ఇంట్లో ఉండే అవకాశం లభిస్తుంది. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెకు అద్దెకు ఇవ్వలేదు.

Image result for village houses girls

ఒక అమ్మాయి ఈ విషయం మీద డాక్యుమెంటరీ తీసింది. తూర్పు లండన్‌లో తన ఇంట్లో ఆశ్రయం ఇస్తానని చెప్పిన ఒక వ్యక్తి ఆమెకు ఎలాంటి అద్దె లేకుండా తన ఇంట్లో ఉండమని చెప్పాడు. రెంట్ కు బదులుగా తనతో సెక్స్‌కు ఒప్పుకోవాలన్నాడు. ఆమె అసలు పేరు బయట పెట్టకుండా యూకేలో ఎంతమంది ఇంటి యజమానులు ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంది. తనకు ఇల్లు అద్దెకు కావాలని, తన వయసు 24 ఏళ్లు అని తాను నర్సుగా పనిచేస్తున్నాని ఒకరికి ఫోన్ చేసింది. అయితే తాను స్నేహితులతో కలసి ఒక ఇంట్లో ఉంటున్నానని, మీరు కూడా నాతో ఉండొచ్చని అతను చెప్పాడు. తన రూంమేట్స్‌తో ఏ సమస్య ఉండదని అన్నాడు. ఆమెని తన గర్ల్‌ ఫ్రెండ్‌గా వారికి పరిచయం చేస్తానన్నాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అతనొక్కడే కాదు చాలా మంది రెంట్ ఫర్ సెక్స్ ప్రతిపాదనలు తన ముందు ఉంచాడు. బాగా పేరున్న ఒక క్లాసిఫైడ్ వెబ్‌సైట్‌లో వెతికితే ఇలాంటి ప్రతిపాదనలు ఒక డజన్ కనిపించాయి. ఆ ప్రకటలన్నీ యూకే నుంచి వచ్చినవే. దేశంలోని పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అన్ని చోట్ల నుంచి ఇలాంటి ప్రకటనలు కనిపించాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక వాటన్నింటిపై ఆమె ఫోకస్ పెట్టింది. ఆమె వారితో నేరుగా మాట్లాడడానికి ప్రయత్నించింది. కొన్ని నిమిషాల్లోనే ఆమెకు ఒకరు రిప్లై ఇచ్చారు. ఇంటి కోసం అడిగితే ఆమె బాడీ, బ్రా సైజు అడిగారు. ఇంకో వ్యక్తి మనం వాట్సాప్‌లో ఎందుకు చాట్ చేయకూడదు అని ప్రశ్నించాడు. ఇలాంటి ప్రతిపాదలనతో వచ్చిన కొంతమంది ఇంటి యజమానులను ప్రత్యక్షంగా కలుసుకోడానికి సిద్ధమైంది ఆమె. వాళ్ల ఆలోచన ధోరణి చూస్తే ఆమెకు ఆశ్చర్యమేసింది. ఒకరికి నిండా 24 ఏళ్లు కూడా ఉండవు. ఇంకో వ్యక్తి తన కూతురు పడక గదిని ఉచితంగా వాడుకోమని చెప్పాడు. ఇలా ప్రతి ఒక్కరూ రెంట్ ఫర్ సెక్స్ కింద ఆమెకు ఇళ్ల ఆఫర్లు ఇచ్చారు. ఇక ఒక 24 ఏళ్ల కుర్రాడు తనతో రెండు రోజులకొకసారి సెక్స్‌లో పాల్గొనాలని ఆమెకు షరతు పెట్టాడు. ఏ గూడు లేని యువతులకు ఇలాంటి వారి వల్ల ఎలాంటి పరిస్థితి వస్తుందోనని ఆమెకు అర్థం అయ్యింది. ఈమె చేసిన డాక్యుమెంటరి ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.మరి ఈ రెంట్ ఫర్ సెక్స్ గురించి అలాగే ఆ అమ్మాయి చేసిన డాక్యుమెంటరీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.