వింత వివాహాలు.. పెళ్లి కూతురిని అందరూ ముద్దుపెట్టుకుంటారు.. వీళ్ళ ఆచారాలు చూస్తే షాకే

391

మ‌న ప్ర‌పంచంలో పెళ్లి తంతు ఒక్కొక్క‌చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. వారి ప‌ద్ద‌తులు సంప్ర‌దాయాల ప్ర‌కారం పెళ్లిళ్లు జ‌రుగుతాయి. అలాగే వింత ప‌ద్ద‌తుల్లో పెళ్లి తంతులు జ‌రిగిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి.. కొన్ని సంప్రదాయాల్లో పెళ్లి కూతురిపై ఉమ్మివేస్తారు. మరికొన్ని సంప్రదాయాల్లో పెళ్లి కూతుర్ని అందరూ ముద్దు పెట్టుకుంటారు. ఇలా ఒక్కో కల్చర్ లో ఒక్కో ట్రెడిషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా పెళ్లి చేసుకున్న వారు హ్యాపీగా ఉండాలని పాటించే సంప్రదాయాలే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని సంప్రదాయాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.

మన భారతదేశంలో పెళ్లిళ్లలో ఎన్నో సంప్రదాయాలున్నాయి. అందులో భాగంగానే కుంబ్ వివాహం నిర్వహిస్తారు. ఇది ఎక్కువగా ఉత్తరాధిన ఉంటుంది. మంగళిక్ అంటే ఆమె మొదటి భర్త మరణం శాపం కలిగి ఉంటుంది. అందువల్ల, ఆమెకు ఆ శాపం యొక్క చెడు ప్రభావాలను తొలగించడానికి ఒక పీపల్ చెట్టు లేదా కుక్కను వివాహం చేసుకోవడం ఒక ఆచారం.మంగలిక్ శాపం ఉన్న మహిళను చేసుకుంటే పెళ్లయ్యాక ఇద్దరిలో ఒకరు అకాల మరణం చెందుతారని నమ్ముతారు. అందువల్ల మంగాలిక్ కు ముందుగా విష్ణు విగ్రహం లేదా ఒక మట్టి కుండ లేదా పెపాల్ లేదా అరటి చెట్టులతో వివాహం చేస్తారు. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు పెళ్లి చేసుకునే ముందు ఈ పద్ధతి పాటించారు.

కెన్యాలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. మస్సాయ్ అనే తెగ వారి పెళ్లితంతు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. వధువు తండ్రి తన కుమార్తె తలపై, రొమ్ములపైన ఉమ్మి వేస్తాడు. ఇలా చేయడం వల్ల తన కూతురికి మంచి జరుగుతుందని వారు భావిస్తారు. అక్కడి వాళ్లు కూతుర్లను ఈ విధంగానే ఆశీర్వదిస్తారు.ఇక మ‌రో సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న వాళ్లు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. పెళ్లి అయిపోయక దంపతులకు బంధువులు చుక్కలు చూపిస్తారు. పెళ్లికి వచ్చిన స్నేహితులు, బంధువులంతా కలిసి పెళ్లి జరిగిన ఇంటి ముందు మకాం వేస్తారు. ఎవరూ భరించలేనంత శబ్దాలు చేస్తూ ఉంటారు. కొత్తగా పెళ్లి అయిన జంట వెళ్లి వాళ్లందరికీ స్నాక్స్, పానీయాలు స్వయంగా ఇవ్వాలి. అప్పడు ఆ శబ్దాలు ఆపుతారు. ఇది ఒక ఫ్రెంచ్ జానపద ఆచారం