ఒక్కడు మూడుముళ్లు వేస్తే ఊరంతా అనుభవిస్తారు…ఈ నీచ సంస్కృతి గురించే తెలిస్తే ఛీ అంటారు..

697

మన దేశ చరిత్రలో అనేకమైన ఆచారాలు ఉన్నాయి.ఆ ఆచారాలలో కొన్ని మంచివి అయితే కొన్ని వినడానికే అసహ్యం పుట్టే ఆచారాలు ఉన్నాయి.భారతదేశ చరిత్రలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు సామాజిక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అనేక సామాజిక దురాచారాలు క్రమక్రమంగా తొలగిపోయాయి. కానీ ఇప్పటికి కూడా కొన్ని నీచ వ్యవస్థలు అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.అలాంటి ఒక నీచ ఆచారం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.ఆ ఆచారమే ఒకడు తాళి కట్టి ఊరు మొత్తం ఆమెను అనుభవించే ఆచారం.ఆ నీచ ఆచారం గురించి ఆ ఆచారానికి బలైన యువతుల గురించి తెలుసుకుందామా.

Image result for marriage

దేవదాసి, బసివిని, మాతంగి… పేరేదైనా.. వారి బతుకులు మాత్రం దుర్భరం. ఎప్పుడో ఎవరో సృష్టించిన అనాగరిక ఆచారానికి బలైపోయిన మహిళలు వారు.అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు చేసిన తప్పునకు శిక్ష అనుభవిస్తున్న దేవదాసీలు వారు. పేరుమారి సమాజం తీరు మారి తమ బతుకులే మారిపోయాక తమను మనుషులుగా గుర్తించాలని కోరుతున్న అభాగ్యులు వారు. అభం శుభం తెలియని పదేళ్ల లోపు బాలికలను ఉలిగమ్మ, యల్లమ్మ, పెన్నోబిలేసు, హనుమంతరాయుడు తదితర దేవాలయాల పేరుతో దేవదాసీలుగా మారుస్తున్నారు.బాలికను పెళ్లికూతురుగా అలంకరించి దేవాలయానికి తీసుకెళతారు. సంప్రదాయం పేరుతో వరుసకు మామ అయ్యే వ్యక్తితో గానీ, లేక ఊరి పెద్దతో గానీ తాళి కట్టించి దేవుడికి వదిలేస్తారు.

Image result for girls depression

 

ఆ తర్వాత ఊరంతా ఆ దేవదాసిని అనుభవిస్తుంటారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఈ దేవదాసిలు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా, జిల్లాలోని 11 మండలాల్లో దాదాపు 2,529 మంది జోగినులు, బసివినులు, దేవదాసీలు ఉన్నట్లు అధికారుల రికాకార్డులు చెబుతున్నాయి. వీరిలో ఓ దేవదాసి తమ బతుకు గురించి వివరించింది. ఆమె బాధ ఆమె మాటల్లోనే… ‘నేను 12వ యేటనే పుష్పావతి అయ్యాను. 17వ రోజున తల్లిదండ్రులో గ్రామ పెద్ద నివశించే గుడిసెకు తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చారు. నిజానికి అలా ఎందుకు వదిలారో నాకు తెలియదు. ఆ రాత్రికి అక్కడే బస చేయమన్నారు. ఇంతలోనే కామంతో కళ్లుమూసుకునిపోయిన ఆ గ్రామపెద్ద చేతిలో తన కన్నెరికం చెదిరిపోయింది.అంటే నా తల్లిదండ్రులే నన్ను వ్యభిచార రొంపిలోకి దించారని, నన్ను అంగడి బొమ్మగా మార్చారని అపుడే తెలుసుకున్నాను.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఆనాటి నుంచి నా జీవితం రోజు నరకప్రాయమే. ఎవరు పడితే వారు నన్ను పిలిచే వారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారు కూడా వెళ్లిరామ్మా అని చెప్పేవారు.అలా చివరకు గ్రామంలో నన్ను వ్యభిచారిగా ముద్ర వేశారు. గౌరవం లేదు, మర్యాదా లేదు. దారెంట పోయే ప్రతి కామపిశాచి నాతో కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇప్పటికీ నా పరిస్థితి ఇదే. ఇలా నా జీవితం దుర్భరంగా మారింది అని అంబాపురం గ్రామానికి చెందిన ఓ దేవదాసి చెప్పుకొచ్చింది.విన్నారుగా ఈ దేవదాసి చెప్పిన తన జీవితం గురించి.మరి ఈ నీచ దేవదాసి వ్యవస్థ గురించి అలాగే సమాజం ఇంత డెవలప్ అవుతున్నా ఇప్పటికి ఈ నీచపు ఆచారాన్ని పాటిస్తున్న సమాజం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.