భార్య మర్మావయవాన్ని ప‌ట్ట‌కర్ర‌తో భ‌ర్త అతికిరాత‌కం చేశాడు తెలిస్తే క‌న్నీళ్లు ఆగవు

314

చిన్నతనం నుంచి పెంచి పెళ్లిచేసిన మేనత్త చనిపోయింది. ఆమె ఆస్తిని రాయించుకుని రావడంలేదని కట్టుకున్న భార్యను గదిలో బంధించి మర్మావయవాన్ని పట్టకారుతో కత్తిరించేశాడు. రక్తస్రావంతో ఆమె బాధపడుతున్నా పట్టించుకోలేదు. అంతేకాదు తన వీర్యాన్ని, మూత్రాన్నితాగాలని లేకుంటే చంపేస్తానన్నాడు. దాంతో భయపడ్డ ఆమె అతని వీర్యాన్ని, మూత్రాన్ని తాగితే వాంతులు అవుతున్నా కక్కనీయకుండా మింగించేశాడు. భర్తతోపాటు అత్తమామలు అదనపు కట్నం కింద రూ.5లక్షలు తీసుకురావాలని నిత్యం శారీరీకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టేవారు. అన్ని బాధలు ఓర్పుగా భరిస్తున్నా ఆస్తికోసం కన్నబిడ్డను చంపుతానని భర్త బెదిరించడంతో ఆ మాతృమూర్తి చలించిపోయింది. దాంతో భర్త అత్త మామలు చేసిన అకృత్యాలపె బాధితురాలు అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కిరాతక భర్త కోటిపల్లి దేవీరమణకుమార్‌, మామ సుబ్బారావులను పోలీసులు అరెస్ట్ చేశారు.. బాధితురాలు ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని సీఐ తెలిపారు.

అమలాపురానికి చెందిన తమ కుమార్తెను రాజమహేంద్రవరం దేవీచౌక్‌ లక్ష్మీవరపు పేటకు చెందిన కోటిపల్లి దేవీరమణకుమార్‌కు ఇచ్చి 2014 మే 2న పెద్దల సమక్షంలో వైభవంగా వివాహం జరిపించారు. కట్నకానుకల కింద రూ.6 లక్షల నగదు, 12 కాసుల బంగారు ఆభరణాలు ఇచ్చారు. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగా జరగడంతో వారికి ఒక కుమారుడు జన్మించాడు. కాలక్రమంలో భర్త రమణకుమార్‌ ప్రవర్తనలో మార్పువచ్చింది. భార్య సెల్‌ఫోన్‌ నుంచి రమణకుమార్‌ ఎవరెవరికో తప్పుడు మెసేజ్‌లు పెట్టి బంధువర్గాల్లో ఆమెను చులకన చేయడం ప్రారంభించాడు.. ఇక అక్కడ నుంచి పెంచిన మేనత్త ఆస్తికోసం.. అదనపు కట్నంకోసం ఆమెను హింసించడం ప్రారంభించాడు.

బాధితురాలిని చిన్ననాటి నుంచి పెంచిన మేనత్తకు అమలాపురంలో రెండు డాబాలున్నాయి. ఆమె బతికుండగానే ఆ డాబాలను తనకు రాసినట్టుగా భర్త రమణకుమార్‌ తప్పుడు వీలునామాలు సృష్టించాడు. ఈఏడాది సెప్టెంబరు 28న అమలాపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆ నకిలీ వీలునామా పత్రాలు చూపించి నాపేరున ఉన్న ఆస్తిని బిడ్డకు రాస్తున్నట్టుగా సంతకాలు చేయమని, లేకుంటే బిడ్డను చంపేస్తానని బెదిరించడంతో భయపడి సంతకం పెట్టినట్టు బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా భార్య పేరున బీమా కూడా చేయించారని, తనను చంపేసి ఆస్తితోపాటు బీమా మొత్తాన్ని భర్త అనుభవించాలని చూస్తున్నాడని బాధితురాలు వివరించింది.

పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం చాలదని, అదనంగా రూ.5 లక్షలు తీసుకురావాలని భర్తతోపాటు అత్తమామలు వేధింపులకు గురిచేసేవారు. అత్తింటి వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చి తనగోడును తల్లిదండ్రులకు చెప్పుకుంది. దాంతో గడచిన ఆగస్టు26న భర్త రమణకుమార్‌ బ్యాంకు ఖాతాకు రూ.2లక్షలు జమచేశారు. దాంతో అత్త మామలు తిరిగి ఆమెను రాజమహేంద్రవరం తీసుకెళ్లారు. మిగిలిన రూ.3లక్షలు తీసుకురాకపోతే పశ్చిమగోదావరి జిల్లా ఉండిగ్రామానికి చెందిన అమ్మాయితో మా అబ్బాయికి మళ్లీ పెళ్లి చేస్తామని వారికి బోలెడు ఆస్తులున్నాయంటూ బెదిరింపులు ప్రారంభించారు. అత్తమామలు అదనపు కట్నంకోసం వేధిస్తుంటే, కట్టుకున్నవాడు మేనత్త ఆస్తి కోసం చిత్రహింసలకు గురిచేసేవాడు. మేనత్తకు చెందిన రెండు డాబాలను రాయించుకునిరానన్నందుకు ఆమెను గదిలో నిర్బంధించి మర్మా వయువాన్ని పట్టకారుతో కత్తిరించాడు.

తీవ్ర రక్తస్రావమవుతున్నా పట్టించుకోలేదు. ఆ బాధను అమలాపురంలోని తల్లికి ఫోన్‌చేసి చెప్పుకుంది. దాంతో బాధితురాలి తల్లి కూతురి అత్తగారికి ఫోన్‌చేసి హెచ్చరించడంతో వెంటనే ఆమె ఒక నర్సును తీసు కొచ్చి వైద్యం చేయించినట్టు ఫిర్యాదులో పేర్కొంది. చిత్రహింసలు భరించలేక అమలాపురం పుట్టింటిలో ఉంటున్న భార్యవద్దకు వచ్చిన భర్త రమణకుమార్‌ ఈ నెల 12న కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై 498(ఏ), 307 సెక్షన్లతోపాటు రెడ్‌విత్‌ 34 ఐపీసీ, వరకట్నవేధింపుల సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి, భర్త దేవీరమణకుమార్‌, మామ సుబ్బారావులను సాయంత్రం అరెస్ట్ చేశారు పోలీసులు