20 ఏళ్ల క్రితం రెస్టారెంట్‌లో దొంగతనం చేసి పారిపోయాడు..ఇప్పుడు అతను చేసిన పని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్న యజమాని

530

కొన్ని ప‌నులు మ‌న జీవితంలో మ‌న ప్ర‌మేయం లేకుండా జ‌రిగిపోతాయి ..మాట కావచ్చు లేదా విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు కావ‌చ్చు ఇలా అనేక‌సార్లు త‌ప్పులు దొర్లుతూ ఉంటాయి.. అయితే ఉద్యోగం చేసే చోట అనేక మిస్టేక్స్ చేస్తే యాజ‌మాన్యం వెంట‌నే వారిని ఇంటికి సాగ‌నంపుతుంది. ఇక వ్యాపారంలో అయినా ఒక‌సారి తేడా వ‌స్తే వారితో వ్యాపారం క‌ట్ చేసుకుంటారు. ఇక కొంద‌రు దొంగ‌త‌నం చేసి అలా ఎందుకుచేశామా అని జీవితాంతం బాధ‌ప‌డుతూ ఉంటారు… మ‌రికొంద‌రు ఇంకా దొంగ‌త‌నం చేసి జీవితంలో ఎటువంటి ఇబ్బంది ప‌డ‌కూడ‌దు అని అనుకుంటారు..

తాజాగా ఇలాంటి ఓ దొంగ స్టోరీ గురించి ఇప్పుడు చ‌ర్చించుకోవాలి…..రెండు దశాబ్దాల క్రితం తాను పనిచేసిన రెస్టారెంట్‌లో డబ్బు దొంగిలించిన ఓ వెయిట్రెస్ పశ్చాత్తాపంతో ఇప్పుడా సొమ్మును వడ్డీతో సహా పంపింది. దానికి ఓ క్షమాపణ లేఖను కూడా జోడించింది. తన క్షమాపణను అంగీకరించాలని, డబ్బులు తీసుకోవాలని అందులో కోరింది. లేఖ చూసిన రెస్టారెంట్ యజమాని హృదయం ద్రవించిపోయింది.మాట‌లు రాక అత‌ని ముఖం ఆశ్య‌ర్యానికి లోనైంది.. అస‌లు ఆస్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికాలోని టెక్సన్‌లో ఉన్న మెక్సికన్ రెస్టారెంట్ ఎల్ చారో కేఫ్ యజమాని చార్లొట్టా ఫ్లోరెస్‌కు జూన్ 27న ఓ కవర్ అందింది. అందులోని లేఖను చదివిన చార్లొట్టా ఆశ్చర్యపోయింది. అందులో 1990లలో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో చదువుకుంటూ మీ రెస్టారెంట్‌లో పనిచేశాను. వెయిట్రెస్‌గా పనిచేసిన నేను తోటి వెయిట్రెస్ ప్రోద్బలంతో పాకెట్ మనీ కోసం కొంత డబ్బు దొంగిలించి తప్పు చేశాను. ఇప్పటికి 20 ఏళ్లు అయినా, ఆ తప్పు నన్ను ఇంకా వెంటాడుతోంది అని ఆమె లేఖ‌లో పేర్కొంది..

రెస్టారెంట్‌లో దొంగతనానికి పాల్పడిన నన్ను మీరు క్షమించాలి. నా క్షమాపణను స్వీకరించడంతోపాటు, దొంగిలించిన సొమ్ముకు 20 ఏళ్ల వడ్డీతో కలిపి పంపుతున్న వెయ్యి డాలర్లను స్వీకరించండి. దేవుడు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ మేలు చేస్తాడు అని ఆ లేఖలో రాసింది. ఈ లేఖను చదివిన రెస్టారెంట్ యజమాని సహా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది… చూశారుగా ఈ జ‌న్మ‌లో చేసిన పాపానికి ఈ జ‌న్మ‌లోనే ఆమె పాప ప‌రిష్కారం చేసుకుంది.. ఇలాంటి అవ‌కాశం అంద‌రికి రాదు అని అంటున్నారు నెటిజ‌న్లు..